ETV Bharat / state

'విద్యా సంస్థల భూములను.. ఇళ్ల పట్టాలకు వాడొద్దు' - పేదలకు ఇళ్ల స్థలాలపై వార్తలు

విద్యా సంస్థల కోసం ఇచ్చిన భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించవద్దని ప్రభుత్వాన్ని రాష్ట్ర హై కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానం కొట్టేసింది.

PIL ON EDUCATION LANDS
న్యాయవాది యోగేశ్
author img

By

Published : Aug 18, 2020, 5:34 PM IST

న్యాయవాది యోగేశ్

విద్యా సంస్థల కోసం ఇచ్చిన భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించటాన్ని ఏపీ హైకోర్టు తప్పుబట్టింది. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల కోసం దాతలు ఇచ్చిన భూములను స్థానిక తహసీల్దార్ ఇళ్ల పట్టాలకు కేటాయించారు. ఈ విషయంపై హెడ్ మాస్టర్, దాతల తరఫున తాండవ యోగేశ్ అనే న్యాయవాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు.

పిల్ పై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది. రాష్ట్రంలో చాలాచోట్ల ఇలాగే జరిగిన నేపథ్యంలో పిల్ పరిధిని రాష్ట్రం మొత్తానికి అన్వయించాలని న్యాయస్థానం నిర్ణయించింది. ఈ ప్రకారం ఏపీలో ఎక్కడా విద్యా సంస్థల భూములు ఇళ్ల పట్టాలకు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసినట్లు న్యాయవాది యోగేశ్ తెలిపారు.

ఇదీ చదవండి:

'ప్రధానికి లేఖ రాస్తే... డీజీపీ స్పందించడమేంటీ?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.