'ఇళ్లలోనే సామూహిక భోజనాలు జరుపుకోండి' - police suggests people to celebrate karthika vanabojanalu
కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజలు తమ ఇళ్లలోనే వనభోజనాలు జరుపుకోవాలని.. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ కోరారు. గుత్తికొండ బిలం సందర్శనానంతరం.. నీళ్లలోకి దిగరాదని హెచ్చరించారు. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు.

పిడుగురాళ్ల సీఐ
కార్తీకమాసం సందర్భంగా గుత్తికొండ బిలం సందర్శించిన భక్తులు.. నీళ్లలోకి దిగవద్దని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.ప్రభాకర్ రావు హెచ్చరించారు. సామూహిక భోజనాలు, గుంపులుగా కలిసి బిలంలోకి వెళ్లడం, మాస్కులు లేకుండా తిరగడం వంటివి నిషేధించామన్నారు. భక్తులు వీటిని గమనించి ఇళ్లలోని పెరట్లో వనభోజనాలు జరపుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: సూర్యలంక తీరానికి తరలివస్తున్న పర్యాటకులు