Physical attack on farmers: ధాన్యానికి డబ్బులు చెల్లించకుండా.. కొనుగోలు చేసిన వ్యక్తి బెదిరిస్తున్నాడంటూ గుంటూరు జిల్లా కాకుమాను మండలం రేటూరు గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గుంటూరు కలక్టరేట్లో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రంలో పాల్గొని అధికారులకు వారి గోడును చెప్పుకున్నారు. 2018లో చేబ్రోలుకు చెందిన రామారావు అనే వ్యక్తి ధాన్యం కొనుగోలు చేసి.. ఇంకా డబ్బులు ఇవ్వలేదని రైతులు ఫిర్యాదు చేశారు. నగదు అడిగినందుకు తమపై భౌతిక దాడులకు దిగుతున్నారని కన్నీరు పెట్టుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం వ్యాపారి నుంచి తమకు ప్రాణహాని ఉందని వాపోతున్నారు. అధికారులు స్పందించి.. ధాన్యం డబ్బులు ఇప్పించి.. తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు.
ఇవీ చదవండి: