ETV Bharat / state

Petrol and Diesel Prices in Andhra Pradesh పెట్రోల్​ ధరలపై నాడు గగ్గోలు.. నేడు బాదుడు! పెత్తందారు పాలనలో ఇదో తరహా మోసం..

Petrol and Diesel Prices in Andhra Pradesh: నాడు రాష్ట్రంలో పెట్రోలు ధరలు పొరుగు రాష్ట్రాల కంటే 7 రూపాయలు ఎక్కువని గగ్గోలు పెట్టిన జగన్‌.. అధికారంలోకి రాగానే ఆ మాటలన్నీ మర్చిపోయారు. అధికారంలోకి వచ్చాకా.. మరీ 7 రూపాయలు తక్కువనుకున్నారో ఏమో.. ఆ వ్యత్యాసాన్ని ఏకంగా రెట్టింపు దాటించేశారు. దీంతో సామాన్యుల నుంచి ముక్కు పిండి.. ఒక్క 2022-23 లోనే ఏకంగా 16 వేల 429 కోట్ల రూపాయల పెట్రో పన్నలను బాదేశాడు..

Petrol_and_Diesel_Prices
Petrol_and_Diesel_Prices
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 23, 2023, 10:37 AM IST

Petrol and Diesel Prices in Andhra Pradesh: 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఎక్కడ సభ పెట్టినా జగన్‌.. పెట్రోల్‌, డీజిల్‌పై బాదుడేబాదుడంటూ... ఘోషించారు. పక్క రాష్ట్రాల కంటే లీటరుపై 5 నుంచి 7 రూపాయలు ఎక్కువని వాపోయారు. ఓ అన్నా.. ఓ అక్కా..! మీకు బైకులున్నాయా? ట్రాక్టర్లున్నాయా? పెట్రోలు, డీజిల్‌ పోయించి బిల్లులు తీసుకోండి..! ఇతర రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దులకు వెళ్లండంటూ ప్రేరేపించారు.

మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పే ఆయన.. అవే మాటలు ఇప్పుడు చెప్పగలరా? ఏపీలోని పెట్రోలు, డీజిల్‌ ధరలను పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూడండని ప్రజలకు పిలుపునివ్వగలరా? మచ్చుకు.. కోనసీమ జిల్లా కేసనకుర్రుతో పోల్చితే.. పక్కనే యానాంలో పెట్రోలుపై 15 రూపాయల 77 పైసలు, డీజిల్‌పై 13 రూపాయల 23 పైసలు తక్కువన్న సంగతిని జగన్ అంగీకరించగలరా?.

ప్రజలకు పెట్రో మంట.. సర్కారుకు కాసుల పంట

CM Jagan Comments Petrol Rates in Opposition: పెట్రో ధరలు మన రాష్ట్రంలో ఉన్నట్లు మరెక్కడా లేవంటూ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నాటి ప్రభుత్వంపై జగన్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2019లో తానే సీఎం అయ్యాక.. పెట్రోలుపై 31 శాతం, లీటరుకు 2 రూపాయల అదనపు సుంకం, డీజిల్‌పై 22.5 శాతం లీటరుకు 2 రూపాయల అదనపు సుంకాన్ని పెంచేశారు. రోడ్డు సుంకం రూపంలో ఒక రూపాయి, దీనిపై వ్యాట్‌ను అదనంగా వడ్డించారు. దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి అయిన జగన్‌.. తన ప్రభుత్వ కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజలందరూ కోటీశ్వరులు అయ్యారని అనుకున్నారో ఏమో.. దేశంలో ఎక్కడా లేనంతగా పన్నుల భారాన్ని మోపారు.

పెట్రో ఛార్జీలనే రాష్ట్ర రాబడికి ఇంధన వనరుగా మార్చుకున్నారు. 2019-20తో పోల్చితే.. 2022-23 నాటికి.. నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వ రాబడి 61.57 శాతం పెరిగింది. గత ప్రభుత్వ హయాంలో 2014-15తో పోల్చితే... 2018-19 నాటికి ఐదు సంవత్సరాలలో ఈ పెరుగుదల 22.87 శాతం మాత్రమే. అలాగని వైసీపీ వచ్చాక పెట్రో ఉత్పత్తుల వాడకం భారీగా పెరిగిందేమీ లేదు. నాలుగేళ్లలో 4.39 శాతం మాత్రమే పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో పెట్రో ఉత్పత్తులపై పన్నుల్లో రాష్ట్ర వాటాగా 16 వేల 429 కోట్లు, గ్యాస్‌, ఇతర ఉత్పత్తులపై మరో 290 కోట్ల రూపాయలు సమకూరాయి. అదనపు సుంకం, రోడ్డు సుంకం రూపంలో వసూలు చేస్తున్న ప్రభుత్వం.. రోడ్లపై గుంతలు కూడా పూడ్చడం లేదు.

Petrol Rates Increased: సామాన్యుడికి శాపంలా మారిన పెట్రో ధరలు

Petrol and Diesel Rates Hike in YSRCP Government: పెత్తందారు పాలనలో బాదుడంటే ఇలాగే ఉంటుందని జగన్‌ చెప్పకనే చెబుతున్నారు. చమటోడ్చే రైతులు, బైక్‌లపై ఊరూరా తిరుగుతూ సరుకులు అమ్ముకునే చిరు వ్యాపారులు, ఆటోడ్రైవర్లనూ వదల్లేదు. జనరేటర్లు వాడే ఆక్వా రైతులు, పరిశ్రమల యజమానులపై పెనుభారాన్ని మోపారు. ఇంధన ధరలు పెంచి వారి ఆదాయానికి కత్తెరేస్తున్నారు. జగన్ సీఎం అయ్యేనాటికి.. పెట్రోలు ధర విజయవాడలో లీటరు 76 రూపాయల 89 పైసలు. ఇప్పుడు 111 రూపాయల 50 పైసలు. లీటరుపై 34 రూపాయల 60 పైసలు పెరిగింది.

గ్రామాల్లో తిరుగుతూ వివిధ వస్తువులు అమ్ముకునే చిరు వ్యాపారి రోజుకు 2 లీటర్ల పెట్రోలు వాడినా.. గతంతో పోల్చితే అదనపు ఖర్చు సుమారు 70 రూపాయలు. నెలలో 25 రోజులు వ్యాపారం చేశాడనుకుంటే.. ఈ మొత్తం 17 వందల 50 రూపాయలు. ఏడాదికి 21 వేల రూపాయలు. అమ్మఒడి కిందో, వాహనమిత్ర కిందో సర్కారు ఇచ్చేదెంత? సామాన్యుడి నుంచి లాగుతోంది ఎంత? అన్నది ఈ లెక్కలు తేటతెల్లం చేస్తున్నాయి.

అశ్వమే వాహనం.. పెట్రోల్ ధరలు భరించలేక గుర్రంపైనే..

2021-22తో పోలిస్తే.. గత ఆర్థిక సంవత్సరంలో కర్ణాటకలో పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు 20 శాతం పెరగ్గా.. పన్నుల రూపేణా ఆదాయం ఒక శాతం మాత్రమే పెరిగింది. రాష్ట్ర పన్నులు తగ్గించడమే.. రాబడి పెరగకపోవడానికి కారణం. అదే ఏపీలో పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు 6.40 శాతం మాత్రమే పెరగ్గా.. పన్నుల రాబడి 11.58 శాతం పెరిగింది. ఆదాయం రాకున్నా సరే.. సామాన్యులపై భారం మోపకూడదని పలు రాష్ట్రాలు పెట్రో పన్నుల భారాన్ని తగ్గించాయి.

People Problems With Petrol Rates: వ్యవసాయ ప్రధాన రాష్ట్రాలన్నింటా ఏపీలోనే పెట్రో ఉత్పత్తులపై ఆదాయం ఎక్కువని.. నిపుణులు చెబుతున్నారు. పెట్రో ఉత్పత్తులపై రాష్ట్రానికి ఈ నాలుగు సంవత్సరాలలో వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే.. 2019-20లో రాబడి 10 వేల 168 కోట్ల రూపాయలుగా నమోదైంది. 2020-21వో ఇది 11 వేల 14 కోట్లు కాగా.. 2021-22లో 14 వేల 724 కోట్లకు పెరిగింది. ఇక 2022-23లో పెట్రో ఉత్పత్తులపై రాష్ట్ర ఆదాయం ఏకంగా 16 వేల 429 కోట్ల రూపాయలకు చేరింది.

పెట్రో ధరలు దేశంలో కెల్లా ఏపీలోనే అధికం..కేంద్రం వెల్లడి

ఏపీలోని సరిహద్దు గ్రామాల వారు.. రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్‌ కొనలేక.. పొరుగున కర్ణాటక, తమిళనాడు, యానాం వెళ్లి పోయించుకుంటున్నారు. అక్కడ అమ్మకాలు పెరుగుతున్నాయి. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. లీటరుపై 5 నుంచి 7 రూపాయలు ఎక్కువగా ఉండే బాదుడేబాదుడంటూ అరచి గగ్గోలు పెట్టిన జగన్‌కు.. తన పాలనలో మరింత ఎక్కువగా ఉన్న విషయం తెలియదా? తెలిసీ పెత్తందారు పాలనలో ఇంతేనని సందేశమిస్తున్నారా? అన్నది ప్రశ్న.

Comparison of Petrol Rates in AP and Other States: ఒక్కసారి ఏపీలోనూ, మన పొరుగు రాష్ట్రాల్లోనూ పెట్రో ఉత్పత్తుల ధరలను పరిశీలిస్తే.. ఏపీలోని కుప్పంలో లీటరు పెట్రోలు ధర 114.32, డీజిల్‌ ధర 101.70 రూపాయలుగా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోలు ధర్ 111.50, డీజిల్‌ ధర 99.27 రూపాయలుగా ఉంది. అదే కేంద్రపాలిత యానాంలో లీటర్‌ పెట్రోల్‌ ధర 96 రూపాయల 82 పైసలు మాత్రమే. ఇక డీజిల్‌ ధర 86 రూపాయల 59 పైసలు మాత్రమే. ఇక కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర 101.94 రూపాయలు కాగా.. డీజిల్‌ ధర 87 రూపాయల 89 పైసలు మాత్రమే. అటు తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోలు ధర 102.34, డీజిల్‌ ధర 94.24 రూపాయలుగా ఉంది.

Petro-Effect: పేదోడి నడ్డి విరుస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు

Farmers Problems Due to Petrol Rates: పెట్రో పన్నుల పెంపుతో రైతులపై పడిన భారం అంతా ఇంతా కాదు. డీజిల్‌ వాడే ట్రాక్టర్‌తో నాగలి తోలకమే ఎకరాకు 13 వందల నుంచి 2 వేల రూపాయలకు చేరింది. గొర్రు, గుంటక సాలుకు 300 రూపాయల దాకా పెరిగి.. ఎకరాకు 600 రూపాయలకు చేరింది. దమ్ము, విత్తనం వేయడం వంటి యంత్ర సేద్య పనులకు ఎకరాకు 4 వేల రూపాయల వరకు అదనంగా ఖర్చవుతోంది. పంట ఉత్పత్తులు, కూలీల రవాణాకు వాడే ఆటోలు, ట్రాక్టర్లు, లారీల బాడుగ గతం కంటే.. 3 వేల రూపాయలకుపైగా పెరిగింది. ఈ లెక్కన ఏడాది భారం 12 వేల 500 రూపాయలపైనే. సర్కారు చెల్లించే రైతు భరోసా ఎంత? పెట్రో పన్నుల రూపంలో గుంజేదెంత? అన్నది ఇప్పటికే అన్నదాతల అనుభవంలోకి వస్తోంది.

VAT ON PETROL: చమురు ధరలపై.. రాష్ట్రం ఏం చేయబోతోంది..?

Petrol and Diesel Prices in Andhra Pradesh: పెట్రోల్​ ధరలపై నాడు గగ్గోలు.. నేడు బాదుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.