ETV Bharat / state

బాబాయ్​ గుండెలో కత్తితో పొడిచి చంపేశాడు - గుంటూరు క్రైమ్ వార్తలు

కుటుంబ కలహాల నేపథ్యంలో బాబాయ్ వరస అయ్యే వ్యక్తిని హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. ఇటీవల తన భర్తతో విబేధాల కారణంగా చంపేశాడని మృతుడి భార్య చెబుతోంది.

v
బాబాయ్​ గుండెలో కత్తితో పొడిచి చంపేశాడు!
author img

By

Published : Oct 21, 2020, 11:36 AM IST

తెనాలి పట్టణంలోని సుల్తానాబాద్​లో చంద్రనాయక్ అనే వ్యక్తి ఇవాళ తెల్లవారుజామున హత్యకు గురయ్యాడు. చంద్రనాయక్ ఇంట్లో నిద్రిస్తుండగా లోనికి ప్రవేశించిన వ్యక్తి విచక్షణా రహితంగా గుండెలపై కత్తితో పొడిచాడు. దీంతో చంద్రనాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. చంద్ర నాయక్ కేకలు వేయటంతో ఆయన భార్య జ్యోతి నిద్ర లేచింది. నిందితుడు వదిలి వెళ్లిన చెప్పులను బట్టి... అతను దుండిపాలెం గ్రామానికి చెందిన తన అక్క కొడుకు సాయిగా జ్యోతి చెబుతోంది. ఇంటి వెనక వైపు తలుపు గడియ తీసి ఉండడంతో లోనికి ప్రవేశించినట్లు ఆమె తెలిపారు. సాయితో తన భర్తకు గొడవ జరిగి ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని ఆమె వాపోయింది. రాడ్ బెండింగ్ కార్మికుడిగా పనిచేసే మృతుడు చంద్రనాయక్ కి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. తెనాలి త్రీ టౌన్ సీఐ హరికృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

'ఎదురు సమాధానమిచ్చినందుకే మహేష్​ను హతమార్చాడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.