గుంటూరు జిల్లా రేపల్లె మండలం పేటేరు వద్ద ఎడ్లబండిని ద్విచక్రవాహనం ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పేటేరుకు చెందిన కల్యాణ్ చక్రవర్తి అనే యువకుడు ద్విచక్రవాహనంపై రేపల్లె పట్టణానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ఎడ్లబండిని వెనుక నుంచి ఢీ కొట్టాడు. తీవ్రగాయాలు కావడంతో అతన్ని, స్థానికులు సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
రైతులకు బేడీల ఘటన..చర్యలకు సీఎస్, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు