గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణం బస్టాండ్ వద్ద గల ఓ లాడ్జిలో నీరుమళ్ల సురేష్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇతను మాచవరం మండలం గంగిరెడ్డిపాలెం గ్రామస్థుడిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లో వసతి గృహాలను నిర్వహిస్తున్న సురేష్ కరోనా కారణంగా హాస్టళ్లు మూత పడటం వల్ల స్వగ్రామానికి వెళ్లే క్రమంలో.. పిడుగురాళ్లలోని హోటల్లో బస చేశాడు. సాయంత్రం రూం బాయ్ తలుపులు తట్టినా తీయకపోవడం వల్ల అనుమానంతో కిటికీలోంచి చూడగా ఫ్యానుకు వేలాడుతూ విగతజీవిగా ఉండడాన్ని సిబ్బంది గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: