ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు పనులు మానుకొని ఉల్లి కోసం బారులు తీరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కిలో రూ.25కు ఉల్లిపాయలు పంపిణీ చేస్తోంది. గృహిణులు, చిరుద్యోగులు గుంటూరులోని పట్టాభిపురం, చుట్టుగుంట రైతు బజార్ల వద్ద ఉదయం 6 గంటల నుంచే బారులు తీరారు. తాము గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నా... ఉల్లిపాయలు దొరకడంలేదని వాపోతున్నారు. అధికారులు కౌంటర్లు పెంచి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో ఉల్లి కొరత తీవ్రం.. ఇబ్బందుల్లో జనం..