గుంటూరు జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నప్పటికీ.. రోడ్లపై జనం రద్దీ మాత్రం తగ్గటం లేదు. ముఖ్యంగా మార్కెట్ ప్రాంతం జనంతో నిత్యం కిటకిటలాడుతోంది. లాక్డౌన్ ఆంక్షలు ముగిసిన తర్వాత జిల్లాలో మరిన్ని కేసులు నమోదవుతున్నాయి.
జిల్లాలో ఇప్పటికే కొవిడ్ కేసుల సంఖ్య ఐదు వేలు దాటిందటే పరిస్థితి తీవ్రత అర్ధమవుతోంది. ఇలాంటి సమయంలోనూ జనం బయటకు రావడం మానడం లేదు. బయటికి వచ్చినపుడు భౌతిక దూరం మర్చిపోతున్నారు. వైరస్ వ్యాప్తికి కారకులవుతున్నారు.
ఇవీ చూడండి: