మూడు రాజధానుల నిర్ణయం, సీఆర్డీఏ బిల్లు రద్దును వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లాలో రాజధాని రైతులు తమ నిరసన కొనసాగిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఎవరి ఇళ్లలో వారే ఆందోళన చేస్తున్నారు. ఓ వైపు హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరుగుతుండగా... మళ్లీ ప్రభుత్వం సీఆర్డీఏ రద్దు బిల్లు పెట్టడం పట్ల రైతులు, మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని రాజధాని మహిళలు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:'బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్గా ఆయన ఉండటం మా దౌర్భాగ్యం'