మూడు రాజధానుల ప్రతిపాదనలపై అమరావతి రైతులు ఆందోళన రోజురోజుకు పెరుగుతోంది. తమ ఆందోళనకు సినీ పరిశ్రమ మద్దతు తెలపాలని గుంటూరు జిల్లా పెనుమాక రైతులు డిమాండ్ చేశారు. సచివాలయానికి వెళ్లే రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమిళనాడులో జల్లికట్టు కోసం కోలీవుడ్ తారలు మెుత్తం ఆందోళనలో పాల్గొంటే... ఇక్కడ మాత్రం ఇళ్లల్లో కూర్చున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రాజధాని కట్టడానికి డబ్బులు లేవన్న ప్రభుత్వం... 3 రాజధానుల ఎలా కడుతుందంటూ... రైతులు నిలదీశారు. కాలువ పూడిక తీయటానికి వచ్చిన ఎమ్మెల్యే, మహిళలంతా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నా ఎందుకు రాటవటం లేదని ప్రశ్నించారు. అమరావతి నుంచే పరిపాలన కొనసాగాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'రాష్ట్ర రాజధాని అమరావతిలోనే ఉండాలి'