ETV Bharat / state

ముంపు ప్రాంతాల్లో నంబూరు శంకరరావు పర్యటన

గుంటూరు జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాల్లో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పర్యటించారు. నీట మునిగిన పంటలను పరిశీలించారు.

author img

By

Published : Aug 17, 2019, 11:22 PM IST

గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలో పులిచింతల జలాశయం వరద ప్రవాహానికి ముంపునకు గురైన ప్రాంతాల్లో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పర్యటించారు. పడవలో వెళ్లి రైతులను కలిసి నీట మునిగిన పంట పొలాలని పరిశీలించారు. పంట నష్టం అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తరఫున రైతుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. వరద సహాయక చర్యలను పరిశీలించారు.

ముంపు ప్రాంతాల్లో నంబూరు శంకరరావు పర్యటన

గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలో పులిచింతల జలాశయం వరద ప్రవాహానికి ముంపునకు గురైన ప్రాంతాల్లో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పర్యటించారు. పడవలో వెళ్లి రైతులను కలిసి నీట మునిగిన పంట పొలాలని పరిశీలించారు. పంట నష్టం అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తరఫున రైతుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. వరద సహాయక చర్యలను పరిశీలించారు.

ముంపు ప్రాంతాల్లో నంబూరు శంకరరావు పర్యటన

ఇదీ చదవండి :

లంక గ్రామాల్లో జోరుగా సహాయక చర్యలు

Intro:ప్రభుత్వం దేవాదాయ శాఖ భూములను పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు తీసుకోవడం తగదని హిందూ దేవాలయ ప్రతిష్ఠాన పీఠాధిపతి కమలానంద భారతి స్వామి పేర్కొన్నారు గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి కొండ పై ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొని మాట్లాడారు


Body:ప్రభుత్వం దేవాదాయ శాఖ భూములను పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు తీసుకోవడం తగదని హిందూ దేవాలయ ప్రతిష్ఠాన పీఠాధిపతి కమలానంద భారతి స్వామి పేర్కొన్నారు ..గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి కొండ పై ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొని మాట్లాడారు.. వేల సంవత్సరాల నుంచి ఎంతోమంది రాజులు, దాతలు దేవాలయాలకు మాన్యాలు అందజేశారు అన్నారు ..వాటి చరిత్ర, ఇతిహాసాలు ఎంతో ప్రాచీనమైన అన్నారు.. అలాంటి దేవాలయ భూములను ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చూస్తే హిందూ సమాజం యొక్క ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు ..ఒకవేళ ప్రభుత్వం అలా చేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, ఈ అంశంపై హిందూ సమాజాన్ని రోడ్డు మీదకు తీసుకువచ్చి పోరాటం చేస్తామన్నారు.. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకానికి దేవాలయ భూములు ఇవ్వాలని ప్రయత్నం చేసిందన్నారు ..ఈ నేపథ్యంలో తాము అన్ని జిల్లాలలో గ్రామ సభలు నిర్వహించి దేవాలయ భూములు దేవాలయాలకు ఉండాలని ఇళ్ల పట్టాలకు వద్దని తీర్మానం చేయించి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించా మన్నారు.. 2006లో హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు ..అది ఎప్పటికీ కొనసాగుతుందన్నారు... అయిన దానికి.. కానిదానికి దేవాదాయ భూముల జోలికి రావద్దని ..బహుళార్ధక ప్రాజెక్టులు ,కాలువలు ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు తమను సంప్రదించి అనుమతి తీసుకోవాలని హైకోర్టు సూచించింది అన్నారు ..ప్రభుత్వం అన్నింటిని దృష్టిలో ఉంచుకొని దేవాలయ భూములు జోలికి రావద్దని.. వచ్చిన వ్యక్తులు ,సంస్థలు, ప్రభుత్వాలు మనజాలవన్నారు.. గతంలో అటువంటి అనుభవాలు ఎదురైనా విషయం గుర్తు చేశారు.. పేదలకు దేవాలయ భూముల లో ఇళ్ళ స్థలాలు ఇచ్చిన వాటిల్లో ఇల్లు కట్టుకుంటే ఏమన్నా అవుతుందని గతంలో ఎవరు వాటి జోలికి రాలేదన్నారు.. ఇది ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు .. ఇటు ఉ ఉ వంటి పరిస్థితుల్లో దేవాలయ భూముల జోలికి రావద్దని కమలానంద భారతి స్వామి సూచించారు ..బైట్1: కమలానంద భారతి స్వామి, హిందూ దేవాలయ ప్రతిష్ఠాపన పీఠాధిపతి


Conclusion:మల్లికార్జునరావు ఈటీవీ భారత్ చిలకలూరిపేట గుంటూరు జిల్లా ఫోన్ నెంబర్ 8 0 0 8 8 8 3 2 1 7
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.