ETV Bharat / state

Revanth Reddy: ఆ నలుగురు ఎమ్మెల్యేల ఫోన్లు ఎందుకు సీజ్ చేయలేదు?: రేవంత్ రెడ్డి

Revanth Reddy comments on TRS MLAs: మునుగోడు ఉపఎన్నిక ముందు తెరాస, భాజపా కలిసి వ్యూహాత్మకంగానే వివాదం సృష్టిస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఎమ్మెల్యేల ఎర కేసులో రోహిత్‌రెడ్డిని నిందితుడిగా చేర్చకుండా పీసీ యాక్టు ఎలా నిలబడుతుందని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నిక, జోడో యాత్ర దృష్టిని మరల్చేందుకే రెండు పార్టీలు కలిసి ఈ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.

Revanth Reddy
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
author img

By

Published : Oct 29, 2022, 10:54 PM IST

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

Revanth Reddy comments on MLAs acquisition Case: తెరాస, భాజపాలు సమన్వయంతో పని చేసుకుంటూ మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పోటీలో లేదనే విషయాన్ని చాటుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పార్టీలూ వ్యూహాత్మకంగానే వివాదం సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను ఆటలో నుంచి తప్పించే విధంగా తెరాస, భాజపా నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. మునుగోడు మండలం కొంపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. మునుగోడు ఉపఎన్నిక, భారత్‌ జోడో యాత్ర దృష్టిని మరల్చేందుకే ఈ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.

రోహిత్‌రెడ్డిని నిందితుడిగా చేర్చకుండా పీసీ యాక్టు ఎలా నిలబడుతుందని రేవంత్​ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో అత్యంత కీలకమైన నలుగురు ఎమ్మెల్యేల ఫోన్‌లను ఎందుకు సీజ్ చేయలేదన్నారు. ఏసీబీ పూర్తిగా కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ నలుగురు ఎమ్మెల్యే ముఠాకు నాయకుడైన కేసీఆర్‌ పర్యవేక్షణలోనే జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయని.. అలా అయితే కేసీఆర్‌ను ఏ1గా, కేటీఆర్​ను ఏ-2గా చేర్చాల్సి ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యేలను కూడా నిందితులుగా చేర్చాలన్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలను తీసుకువెళ్లిన పోలీసుల చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుందన్నారు. విచారణ సంస్థలపై తమకు నమ్మకం లేదని.. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ కేసును విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్‌ గుండుతో గుట్ట ఎక్కి ప్రమాణం చేసినా ప్రజలు నమ్మరని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

"ఎన్నికల వేల భాజపా, తెరాసలు కలిసి వివాదాలను తెరపైకి తెస్తున్నాయి. ఎన్నికల సమయంలో భావోద్వేగ అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ పోటీలో లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దుబ్బాక ఎన్నికల్లో రఘునందన్‌రావు విషయంలో బీభత్సం సృష్టించారు. హుజూరాబాద్ ఎన్నికల ముందు ఈటెలను చంపేసినంత చేశారు. ఈటెల రాజేందర్‌పై కేసులు ఎక్కడికి పోయాయి? ఎన్నికలు, జోడోయాత్రను పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. నలుగురు ఎమ్మెల్యేల ఫోన్‌లు ఎందుకు సీజ్ చేయలేదు. కేసీఆర్‌ కుట్ర చేశారనే అనుమానాలు వస్తున్నాయి. కుట్రపై సీఎం, హోం మంత్రి ఇప్పటివరకు స్పందించడం లేదు. ఏసీబీ, సీబీఐలపై నమ్మకం.. విశ్వాసం లేదు. కేసును సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ చేపట్టాలి".- రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.