జనసేన అధినేత పవన్ కళ్యాణ్... నేడు మంగళగిరిలోని పార్టీలోని కాపు సంక్షేమసేన ప్రతినిధులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కాపులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ హోంమంత్రి చేగొండి హరిరామజోగయ్య ఇటీవల పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. ఆ లేఖకు స్పందించిన పవన్... ఓ ప్రతినిధి బృందాన్ని తనవద్దకు పంపాలని కోరారు.
ఈ మేరకు కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో భేటీ కానున్న పవన్ కల్యాణ్... రాష్ట్రంలో కాపులకు ఈబీసీ రిజర్వేషన్లు అమలుకాకపోవటంపై చర్చిస్తారు. రాష్ట్రంలో ఆలయాల పరిరక్షణ కోసం జనసేన తరపున షాడో కమిటీల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. తిరుమల సహా 11 ప్రధాన ఆలయాలకు కమిటీల ఎంపిక త్వరలోనే ఆరంభంకానుంది.
ఇదీ చదవండి: