ఇళ్ల పట్టాల పేరిట తమ భూములను అధికారులు బలవంతంగా లాక్కుంటున్నారంటూ గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం పాత గణేశునిపాడుకు చెందిన రైతులు... గుంటూరు గ్రామీణ ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. తమ జీవనాధారమైన భూమిని ఇళ్ల స్థలాల పట్టాల పేరుతో అధికారులు, వైకాపా నాయకులు లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పంటను నాశనం చేసి రోడ్లు వేస్తున్నారని.. హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించారని వాపోయారు. తమను, తమ భూముల్ని కాపాడాలని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో అభ్యర్థించారు. 60 ఏళ్లుగా బంజరుభూమిని సాగుచేస్తున్న తమకు 2007లో ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందన్నారు.
ఇదీ చదవండి