ETV Bharat / state

తెనాలిలో దారుణం.. బాలుడిపై లైంగిక దాడి

Rape on Minor Boy at Tenali: గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం చోటుచేసుకుంది. పాస్టర్ రూపంలో ఉన్న ఓ కామాంధుడు.. బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో తెనాలి 2వ పట్టణ పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

minor boy raped by pastor
minor boy raped by pastor
author img

By

Published : Mar 30, 2022, 7:56 PM IST

Tenali Crime News: గుంటూరు జిల్లా తెనాలిలో బాలుడిపై ఓ పాస్టర్ లైంగిక దాడి చేశాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన దంపతులు.. తమ బిడ్డను దేవుని సన్నిధిలో ఉంచితే మంచి జరుగుతుందని భావించారు. దీంతో.. 9 ఏళ్ల వయసున్న తమ పిల్లాడిని తెనాలి పట్టణం ఐతానగర్​లోని కల్వరి ప్రార్థన మందిరంలో గత ఏడాది మే 3న వదిలి వెళ్లారు. అప్పటి నుంచీ అక్కడే ఉంటున్నాడు. అవసరమైనప్పుడు తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు.

అయితే.. ఇటీవల ఇంటికి వచ్చేస్తానని చెప్పడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 10న బాలుడిని ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి వెళ్లిన దగ్గర్నుంచి బాలుడు అనారోగ్యంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. దీంతో.. పాస్టర్​ అహరోన్​ ప్రకాశ్​ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలుడు చెప్పాడు. ఈ అమానుష సంఘటన తెలుసుకున్న తల్లిందండ్రులు.. వెంటనే తెనాలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పాస్టర్​పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి:
Today Crime: రెండు కార్లు ఢీ.. ముగ్గురికి తీవ్రగాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.