ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంత నియోజకవర్గం గుంటూరు జిల్లా మాచర్లలో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో మెుత్తం 77 పంచాయతీలకు గానూ..73 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కారంపూడి-15, మాచర్ల-16, వెల్దుర్తిలో 20 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. రెంటచింతల మండలంలో-3, దుర్గి మండలంలో ఒక పంచాయతీకి ఎన్నికలు జరగనున్నాయి.
అప్పుడు కూడా అంతే..
గతేడాది మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగానూ.. మాచర్ల నియోజకవర్గంలో ఇదే తరహా ఒరవడి కనిపించింది. మాచర్ల మున్సిపాలిటీలోని అన్ని వార్డులు, నియోజకవర్గంలోని ఐదు జెడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. ఎంపీటీసీల్లో కేవలం ధర్మవరం స్థానంలో మాత్రమే అప్పట్లో జనసేన అభ్యర్థి నామినేషన్ వేశారు.
ఇదీచదవండి...