గుంటూరు జిల్లా కారంపూడిలో దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా వస్తున్న పల్నాటి వీరుల ఆరాధనోత్సవాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ తిరున్నాళ్ళకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని ఆచారవంతులు (వీరాచారులు) తెలిపారు. మొక్కులు చెల్లించేవారు సామాజిక దూరం పాటిస్తూ తమ కార్యక్రమం పూర్తి చేసుకోవాలన్నారు. ప్రజలందరూ తమకు సహకరించాలని పోలీస్ శాఖ తెలిపారు.
ఈ ఉత్సవాలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు గురజాల డీఎస్పీ బి.ఎమ్ జయరామ్ ప్రసాద్ వెల్లడించారు.
ఇవీ చదవండి