పల్నాడును జిల్లాగా ప్రకటించాలని పల్నాడు జిల్లా సాధన సమితి సభ్యులు కోరారు. దానికి గురజాలను కేంద్రంగా చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని వల్లెల గార్డెన్లో సాధన కమిటీ జేఏసీ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి గురజాల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గురజాలను కేంద్రంగా.. పల్నాడు జిల్లా ఏర్పాటుకు పార్టీలకు అతీతంగా అందరూ కలిసిరావాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రాయపూడి సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద ఉద్రిక్తత