ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్ : కొనుగోళ్లు లేక తాటిబెల్లం గీత కార్మికులు అవస్థలు

కరోనా మహమ్మారి కల్లోలానికి అన్ని వ్యాపారాలు, పరిశ్రమలు కుదేలయ్యాయి. కరోనా లాక్ డౌన్ ప్రభావం తాటి బెల్లం తయారుచేసే గీత కార్మికులపై కూడా పడింది. తాటిబెల్లం తయారీ జీవనాధారంగా ఉన్న కార్మికులు ఉపాధి కోల్పోయారు. తయారు చేసిన బెల్లాన్ని ఎవరూ కొనకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

కొనుగోళ్లు లేక తాటిబెల్లం గీత కార్మికులు అవస్థలు

author img

By

Published : Jul 20, 2020, 12:25 PM IST

గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం కళ్లిఫలం గ్రామం తాటి బెల్లం తయారీకి ప్రసిద్ధి. గ్రామంలో అందరూ గీత కార్మికులే ఉండడంతో...తరతరాలుగా తాటి బెల్లం తయారీని జీవనాధారంగా నమ్ముకున్నారు. తాటిచెట్ల నుంచి తీసే కల్లుతో బెల్లం తయారుచేస్తుంటారు. ప్రకృతి సిద్ధంగా తయారుచేసే ఈ బెల్లానికి మంచి గిరాకీ ఉంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి బెల్లాన్ని కొనుగోలు చేస్తుంటారు.

తయారీ ఇలా...

తాటిబెల్లం తయారీలో...ముందుగా సముద్రంలోని నత్త గుల్లలను సేకరిస్తారు. వాటిని కాల్చి సున్నంలా పొడి చేస్తారు. ఆ తెల్లటి సున్నాన్ని కల్లుకుండ లోపల భాగంలో పూతపూసి తాటిచెట్టుకు తగిలిస్తారు. కుండ లోపల పడిన కల్లు ఈ పొడి వలన పాకంలా మారుతుంది. ఈ పాకాన్ని కడాయిలో పోసి మరిగిస్తారు. 100 లీటర్ల పాకాన్ని రోజంగా మరిగిస్తే పది లీటర్ల బెల్లం చారు వస్తుంది. అలా వచ్చిన చారును పెద్ద పెద్ద డ్రమ్ముల్లో నిల్వ ఉంచుతారు. ఈ బెల్లం చారును తాటి బెల్లంగా మార్చేందుకు మరోసారి మరిగిస్తారు. అప్పుడు బాగా చిక్కగా మారిన పాకాన్ని చల్లబరిచి అచ్చుల్లా పోస్తారు. ఇలా చేసిన 15 నిమిషాల్లో పాకం గడ్డకట్టి బెల్లంగా మారుతుంది.

కరోనా దెబ్బ

ఇలా ఆరుగాలం కుటుంబసభ్యులంతా కష్టపడితే బెల్లం తయారవుతుంది. తాటిబెల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉండడంతో మంచి గిరాకీ ఉంటుంది. తాటికల్లు వచ్చే నాలుగు నెలల సమయంలో మాత్రమే బెల్లం తయారీ సాగుతోంది. అయితే ఈ ఏడాది బెల్లం తయారీ నాలుగు మాసాల సమయంలో కరోనా ప్రభావం ఉండడంతో.. తమ జీవనాధారం కోల్పోయామని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆదుకోండి

మూడు నెలల పాటు పూర్తి లాక్ డౌన్ వల్ల కొనుగోలుదారులు లేక తీవ్ర ఇబ్బందులకు పడుతున్నామని కార్మికులు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పాకాన్ని బెల్లంగా తయారుచేసిన కొనేందుకు ఎవరూ రావడం లేదని వాపోతున్నారు. తరతరాలుగా ఈ వృత్తినే నమ్ముకున్న తమకు.. కరోనా ఎంతో నష్టంచేసిందని, తమను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని గీత కార్మికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి : కోనాంలో సమృద్ధిగా నీరు.. ఖరీఫ్ సాగుకు లేదిక బెంగ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.