ETV Bharat / state

జీవో నెంబర్ ఒకటి రద్దు కోరుతూ చలో అసెంబ్లీ.. రాష్ట్రంలో ముందస్తు అరెస్టులు

Chalo Assembly: జీవో నెంబర్ వన్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడికి విపక్ష పార్టీలు పిలుపు నివ్వగా.. ఈ కార్యక్రమానికి టీడీపీ మద్దతు తెలిపింది. ముందస్తు అరెస్టులతో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు జగన్ సర్కార్ ప్రయత్నిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ న్యాయవాది, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావుని పోలీసులు గృహ నిర్భందం చేశారు.

chalo assembly
chalo assembly
author img

By

Published : Mar 19, 2023, 10:42 PM IST

Chalo Assembly: రేపు ఏపీ అసెంబ్లీ ముట్టడికి అఖిల పక్షం పిలుపునిచ్చారు. జీవో నెంబర్ వన్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడికి విపక్ష పార్టీలు పిలుపునిచ్చారు. రేపటి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి టీడీపీ మద్దతు తెలిపింది. ప్రభుత్వ నిరంకుశ విధానాలను చలో అసెంబ్లీ ద్వారా చాటి చెప్తామని అఖిల పక్ష నాయకులు హెచ్చరించారు.

ముందస్తు అరెస్టులతో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు జగన్ సర్కార్ కుటిలయత్నాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నాయకులపై ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులకు, గృహ నిర్బంధాలకు పాల్పడటం దుర్మార్గమని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ప్రజాస్వామిక విలువలను కాలరాసిందన్నారు. శాంతియుత ప్రజా ఉద్యమాలపై పోలీసులచే ఉక్కుపాదం మోపటం తగదని, తక్షణమే జీవో నెంబర్ 1 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాతంత్రవాదులంతా రాష్ట్ర ప్రభుత్వ దమననీతిని ఖండించాలని కోరారు.

"మీరు జీవో నెంబర్ వన్ తీసుకురావడం ద్వారా.. రాష్ట్రంలో ఒక పోలీసు రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ దానికి అరెస్టులు చేస్తున్నరు. గృహ నిర్బంధాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి త్వరలోనే గుణపాఠం జరుగుతుంది. ఎందుకంటే మీరు దుష్ట చట్టాలను ఇచ్చి.. వాటిని ఉపసంహరించుకోమని చేప్తున్నా కూడా వినకుండా.. హైకోర్టులో కూడా అడ్డదిడ్డంగా వాదిస్తున్నారు. అరెస్టులకు బయపడేది లేదు. వెనుకకు జంకేది లేదు. కచ్చితంగా చలో అసెంబ్లీ నిర్వహించి తీరుతాం". - రామకృష్ణ,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ప్రముఖ న్యాయవాది, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావుని పోలీసులు గృహ నిర్భందం చేశారు. జీవో 1 రద్దు కోసం ఛలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో రాజమహేంద్రవరం తాడితోట బైపాస్ రోడ్డులోని ముప్పాళ్ల సుబ్బారావు ఇంటికి పోలీసు అధికారులు వచ్చి 151 CRPC నోటీసులు ఇచ్చారు. జీవో 1 పోరాట ఐక్య వేదిక ఆధ్వర్యంలో రేపు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఐక్య వేదిక కన్వీనర్ ముప్పాళ్లకు నోటీసు అందించి గృహ నిర్బంధం చేశారు. ప్రభుత్వం ఎన్ని రకాలుగా నిర్బంధం చేసినా జోవో రద్దు చేసే వరకు పోరాటం ఆగదని ముప్పాళ్ల హెచ్చరించారు.

"అరెస్టుల ద్వారా ఈ ఉద్యమాన్ని నీరు గారుస్తామంటే.. అది నల్ల జీవో.. బ్రిటీష్ వారు కూడా అలాంటి జీవోలను తీసుకొని రాలేదు. ఈ జీవో తీసుకొచ్చి.. ప్రజల నోరు నొక్కడానికి, ప్రజా సంఘాల నోరు నొక్కడానికి, ప్రతిపక్షాల నోరు నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాము". - ముప్పాళ్ల సుబ్బారావు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

జీవో నెంబర్ వన్ రద్దు కోరుతూ చలో అసెంబ్లీ.. రాష్ట్రంలో ముందస్తు అరెస్టులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.