ETV Bharat / state

వీధి బాలలను కాపాడేందుకు ఆపరేషన్ ముస్కాన్ కొవిడ్-19: డీజీపీ - operation muskan covid 19 in ap

కరోనా వంటి విపత్కర సమయంలో వీధి బాలలను కాపాడేందుకు ఆపరేషన్ ముస్కాన్ కొవిడ్ 19ను ప్రారంభించినట్లు గౌతమ్ సవాంగ్ తెలిపారు. వీధిబాలలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పునరావాస కేంద్రాలకు తరలించనున్నట్లు వెల్లడించారు.

operation muskan started in state by dgp gowtha sawang
డీజీపీ గౌతమ్ సవాంగ్
author img

By

Published : Jul 14, 2020, 4:44 PM IST

ఆపరేషన్ ముస్కాన్ కొవిడ్-19 కార్యక్రమాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఘనంగా ప్రారంభించారు. దేశంలోనే మెుదటిసారిగా ఆపరేషన్ ముస్కాన్​ కొవిడ్-19ను సీఐడీ నిర్వహిస్తుందని డీజీపీ తెలిపారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్​లు, వివిధ కర్మాగారాల్లో బాలకార్మికులుగా, అనాథలుగా రోడ్లపై తిరుగుతున్న వారిని సీఐడీ అధికారులు రక్షిస్తారని గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ ఆపరేషన్​లో పోలీస్, సీఐడీ, మున్సిపల్, ఐసీడీఎస్, మహిళా శిశు సంక్షేమ శాఖ మెుదలగు శాఖలన్నీ పాల్గొంటాయని వెల్లడించారు. వీధిబాలలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రిపోర్ట్​ల ఆధారంగా పునారావాస కేంద్రాల్లో చేర్పిస్తామన్నారు. బాలలకు కావాల్సిన ఉచిత విద్య, మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 1,916 కరోనా కేసులు.. ఒక్క రోజులోనే 43 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.