కరోనా రోగులకు ప్రాణవాయువు అందించేందుకు గుంటూరు జిల్లాలోని కాజాలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్‌ను అందుబాటులోకి తెచ్చారు. గుంటూరు జిల్లా రెడ్ క్రాస్ ఉపాధ్యక్షుడు రవి శ్రీనివాస్ ఆక్సిజన్ బ్యాంక్‌ను ప్రారంభించారు. తొలివిడతలో భాగంగా 50 ఆక్సిజన్ సిలిండర్లను అందజేస్తున్నామని చిరంజీవి రాష్ట్ర అభిమానుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రవీంద్రబాబు తెలిపారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో చిరంజీవి ఎప్పుడూ ముందు ఉంటారన్నారు. ఆక్సిజన్ కావాల్సిన వారు తమను సంప్రదిస్తే ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పారు. ఆక్సిజన్ సిలిండర్ల కోసం చిరంజీవి అభిమానులు రూ.5లక్షలు విరాళంగా ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని చిరంజీవి ఇటీవల తెలిపారు. ఈ క్రమంలోనే నేడు అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ‘చిరు ఆక్సిజన్ బ్యాంక్’ సేవలు ప్రారంభించారు.
ఇవీ చూడండి: