కోవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రం మొత్తం లాక్డౌన్ ప్రకటించారు. అయిన అమరావతి రైతులు మాత్రం తమ దీక్షను కొనసాగిస్తున్నారు.అయితే నలుగురు కంటే ఎక్కువమంది దీక్షాశిబిరంలో ఉండకూడదని ఆదేశాలు జారీచేశారు. అలా ఉండే నలుగురు కూడా 50 సంవత్సరాలలోపు వయసు వారే ఉండాలని తెలిపారు. తప్పనిసరిగా మాస్క్ లేదా కర్చీఫ్ కట్టుకుని ప్రతి గంటకి శానిటేషన్ నిర్వహించుకుంటూ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవాలని నిర్ణయించారు. శిబిరాలలో మైక్‌లు, జన సమూహం లేకుండా చూసుకోవాలని సూచించారు. మిగిలిన వారు వారి వారి ఇళ్లల్లో దీక్ష చేస్తూ ఫోటోలు వీడియోలు తీసి పంపించాలని నిర్ణయించారు.
ఇదీ చూడండి తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్.. సిబ్బంది అప్రమత్తం