గుంటూరు నగరం సంగడిగుంటకు చెందిన కమ్మాల శ్రీనివాసరావు ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. రోజూ లాగే తన కుమారుడు గోపితో కలసి గుంటూరులో అరటికాయలు లోడ్ చేసుకుని పెదకూరపాడు బయల్దేరారు. మేడికొండూరు మండలం సిరిపురం పెట్రోల్ బంకు వద్ద వారు ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి పక్కన ఉన్న లంకలోనికి దూసుకుపోయి పల్టీ కొట్టింది.
ఈ ఘటనలో శ్రీనివాసరావు తలకు గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మేడికొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
28న మచిలీపట్నానికి పవన్.. రైతుల పక్షాన కలెక్టర్కు వినతి పత్రం