గుంటూరు నవభారత్ నగర్‌కు చెందిన నలబోలు విష్ణు, రాధిక దంపతుల కుమార్తె వివాహం తిరుమల వెంకటేశ్వరస్వామి సన్నిధిలో జరగాలని 2 నెలల ముందే నిర్ణయించి తగిన ఏర్పాట్లు చేశారు. కరోనా కారణంగా లాక్‌డౌన్‌తో ఇంటి వద్దే కేవలం కుటుంబ సభ్యుల తోనే గోవిందరాయ హరీష్ - విజయలక్ష్మి వివాహం నిర్వహించారు. పెళ్లికి బహుమతిగా వధువు తాత లక్ష రూపాయల చెక్కును ఇచ్చారు. ఆ మొత్తాన్ని కరోనా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి పరికరాలు, మందుల కోసం విరాళంగా ఇచ్చారు. ఈమేరకు నూతన దంపతులను ఆశీర్వదించటానికి వచ్చిన నరసరావుపేట ఎంపి శ్రీకృష్ణదేవరాయలకు వారు చెక్కును అందజేశారు.
ఇదీ చూడండి: