ETV Bharat / state

స్థల వివాదం: మామ, అల్లుడు మధ్య ఘర్షణ.. మామ మృతి - గుంటూరు జిల్లా మామ, అల్లుడు మధ్య ఘర్షణలో ఒకరు మృతి

గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణం వైయస్సార్ కాలనీలో.. స్థల వివాదం కారణంగా మామ, అల్లుడు మధ్య ఘర్షణ నెలకొంది. ఘటనలో మామ మృతిచెందగా.. అల్లుడు, మృతుని కుమారుడు గాయపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

one died in land clash between son in law and uncle at guntur
మామ, అల్లుడు మధ్య ఘర్షణ.. ఘటనలో మామ మృతి
author img

By

Published : Jul 6, 2021, 10:28 AM IST

స్థల వివాదం కారణంగా.. క్షణికావేశంలో మామ, అల్లుడు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో మామ మృతి చెందాడు. ఈ ఘటన.. గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో జరిగింది. చిలకలూరిపేట పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీకి చెందిన.. షేక్ సుభాని, అతని అల్లుడు సుభాని కుటుంబాల మధ్య స్థల వివాదం ఉంది. సోమవారం అర్ధరాత్రి రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరగగా.. ఒకరిపై ఒకరు పరస్పర దాడికి పాల్పడ్డారు. ఘర్షణలో మామ షేక్ సుభాని(68) మృతి చెందగా.. అల్లుడు సుభాని, మృతుడి కుమారుడు జానీ భాషలు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు వీరిని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం.. వైద్యుల సూచనల మేరకు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన అల్లుడు సుభాని పట్టణంలోని ఎన్​ఆర్టీ సెంటర్ బైక్ మెకానిక్ షాప్ నిర్వహిస్తుంటాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

Drone: శ్రీశైలంలో డ్రోన్ సంచారంపై విచారణ వేగవంతం: ఎస్పీ ఫకీరప్ప

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.