ETV Bharat / state

ఆస్తి పోయింది.. శోకం మిగిలింది - వృద్ధుల కష్టాలపై వార్తలు

గుంటూరు జిల్లా మేడికొండూరులో ఓ వృద్ధ దంపతులు తమను చూసుకుంటాడని మనవడి పంచన చేరారు. తమకున్న ఆస్తిని తదనంతరం ఆతని పేరు మీద రాశారు. వారి నమ్మకంపై ఆ మనవడు మట్టి కొట్టాడు. ఆస్తి రాయించుకుని తమను ఇంటి నుంచి వెళ్లిపోమంటున్నాడని వృద్ధ దంపతులు వాపోతున్నారు.

old people problem at medikonduru
వృద్ధ దంపతుల కష్టం
author img

By

Published : Oct 3, 2020, 8:52 AM IST

వృద్ధాప్యంలో బాగోగులు చూసుకుంటూ అండగా ఉంటారని ఆస్తిని కూతురు బిడ్డకు రాసిచ్చారు. ఆస్తి తీసుకుని తమని పట్టించుకోవడం లేదని వృద్ధ దంపతులు వాపోతున్నారు. ఆస్తి తీసుకుని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ వృద్ధ దంపతులు గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మేడికొండూరు మండలం పేరేచర్ల చెందిన మదమంచి శివయ్య, కోటేశ్వరమ్మ దంపతులు వృద్ధులయ్యారు. ముసలితనంలో బాగోగులు చూసుకుంటారన్న ఆశతో వారి పేరుమీద ఉన్న ఐదు సెంట్ల స్థలం, ఒక ఇల్లు వారి తదనంతరం కూతురు బిడ్డ కళ్యాణ్ చక్రవర్తి కుటుంబానికి రాసి ఇచ్చారు. కళ్యాణ్ చక్రవర్తి లారీ డ్రైవర్​గా పని చేస్తున్నాడు. పది రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్ళాడు. అప్పటినుంచి చక్రవర్తి భార్య అనూష మానసికంగా ఇబ్బంది పెడుతోందని దంపతులు వాపోతున్నారు.

వారికి అప్పు లు అయ్యాయని.. ఇంటి నుంచి బయటికి వెళితే ఇల్లు అమ్ముతామని ఒత్తిడి చేస్తోంది. తక్షణమే ఇల్లు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని వృద్ధులు వాపోయారు. మోసం చేసి వారి తదనంతరం చెందవలసిన ఆస్తిని చక్రవర్తి కుటుంబం సభ్యుల పేరు మీదకు రాయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కోరుతూ వృద్ధ దంపతులు మేడికొండూరు పోలీసులను ఆశ్రయించారు.

ఇదీ చదవండి: దీటుగా స్పందిద్దాం...అపెక్స్ కౌన్సిల్ భేటీపై సీఎం నిర్దేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.