గుంటూరు మార్కెట్ సెంటర్ బస్టాండ్ వద్ద ఓ వృద్ధురాలి దీన వ్యవస్థ అందరిని కలిచి వేస్తోంది. ఓపిక లేక.. ఒంట్లో సత్తువ లేక.. తన పనిని తాను చేసుకోలేని దయనీయ స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలిని చూసి చలించిన స్వధార్ మేనేజర్ సంధ్యారాణి ఆమెకు సపర్యలు చేసింది. స్థానిక సీఐ సాయంతో గుంటూరులోని నిర్మల్ హృదయం ఆశ్రమంలో చోటు కల్పించారు. ఎక్కడినుంచి వచ్చిందో తెలియని ఆ అవ్వ రెండుళ్లుగా మార్కెట్ సెంటర్లోని పల్నాడు బస్టాండ్లోనే ఉంటుంది. ఎవరిని కూడా చేయి చాచి అడిగేది కాదు.. ప్రస్తుతం ఆమె నిలబడ లేని స్థితికి చేరింది. మలమూత్రాలు సైతం దుస్తులలోనే చేసుకుంటోంది. సమాచారం తెలుసుకున్న స్వధార్ కేంద్రం సభ్యులు సపర్యలు చేసి ఆమెను ఆశ్రమంలో చేర్పించారు. అందరూ అయ్యో పాపం అనుకుంటూ వెళ్లకుండా.. చేతనైన సాయం చేస్తే వృద్ధులకు ఆధారం దొరుకుతుందని స్థానికులంటున్నారు.
ఇదీ చూడండి