గుంటూరులో టిడ్కో గృహాల లబ్ధిదారులకు హడావుడిగా ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ చేతులు మీదుగా పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు ఇచ్చి లబ్ధిదారులుతో ఫొటోలు దిగారు. సొంత ఇంటి పట్టాలు వచ్చాయి అని సంతోష పడే సమయంలో.. ఎమ్మెల్యే వేరే కార్యక్రమం ఉందని వెళ్లారు. ఎమ్మెల్యే వెళ్లగానే లబ్ధిదారులు నుంచి పట్టాలు వెనక్కి తీసుకున్నారు.
అదేంటి అని అడిగితే పట్టాలు పైన మున్సిపల్ కమిషనర్ సంతకం చేయలేదు.. సంతకం చేయించిన తర్వాత ఇస్తామని సచివాలయ సిబ్బంది చెప్పారు. దీంతో లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. గత రెండు ఏళ్లుగా గృహాలు ఇస్తామని చెప్తూ.. ఇప్పటివరకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ దృష్టి సారించి త్వరగా ఇళ్లను మంజూరు చేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:
వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం నిధులు విడుదల.. రైతుల ఖాతాల్లో 510 కోట్లు