పశువుల దాణాలో కల్తీ జరుగుతోందని ఆహార భద్రతాధికారులకు ఫిర్యాదులు అందాయి. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఆటోనగర్‌లోని ఓ పశువుల దాణా తయారీ కేంద్రంలో సోదాలు చేశారు. శనక్కాయ పొట్టు, బియ్యం పిండి, పత్తి విత్తనాలను కలిపి పశువులకు దాణా తయారీ చేసే కంపెనీలో చెక్క రంగు వచ్చేందుకు నిషేధిత పసుపు రంగు వాడుతున్నట్లు ఫిర్యాదు రావడంతో శుక్రవారం దాడి చేశారు. తనిఖీలో నిషేధిత రంగు గుర్తించి రెండు లక్షల విలువైన 200 బస్తాల దాణాను సీజ్ చేసినట్లు జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ అధికారి షేక్ మొహిద్దీన్ తెలిపారు. ఈ దాణా తిన్న పశువుల నుంచి వచ్చే పాలు తాగితే మానవాళికి కూడా ముంపు పొంచి ఉందని ఆయన వివరించారు.
ఇవీ చదవండి: 'వర్చువల్ లోక్‌అదాలత్ లో కేసులు పరిష్కరించుకోండి'