గుంటూరు జిల్లా అమృతలూరు మండలం మోపర్రులో ఉపాధి హామీ బిల్లులు తగ్గించారంటూ కూలీలు ఆందోళన చేశారు. తాము పది రోజుల నుంచి పని చేస్తుంటే రోజుకి 200 రూపాయలు ఇవ్వాల్సిన అధికారులు... 30 రూపాయల చొప్పున మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొలతలు సరిగా వేయకపోవటం వల్ల ఈ తప్పు జరిగిందని అధికారులు తెలిపారు. ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటామని చెప్పారు.
ఇదీ చూడండి: