ETV Bharat / state

విధుల కోసం పిలిచారు... పడిగాపులు కాయించి పంపించేశారు!

అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగా గుంటూరులో నర్సింగ్, పారామెడికల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కరోనా విధుల కోసం రావాలంటూ జిల్లాలోని వివిధ కాలేజీల విద్యార్థులకు సందేశం పంపిన అధికారులు... వారికి విధుల కేటాయింపులో ఉదాసీనంగా వ్యవహరించారు. ఫలితం వందలాది మంది జిల్లా వైద్యవిద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద పడిగాపులు పడాల్సి వచ్చింది.

nursing students
nursing students
author img

By

Published : Jul 27, 2020, 4:56 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న తరుణంలో వైద్యసేవలు విస్తరించారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రులు, కొవిడ్ కేర్ కేంద్రాలను పెంచారు. అందుకు తగ్గట్లుగా సిబ్బంది అవసరం ఏర్పడింది. దీని కోసం అత్యవసరంగా 700మంది నర్సులు, పారామెడికల్ సిబ్బందిని నియమించాలని అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు జిల్లాలోని ప్రైవేటు నర్సింగ్, పారామెడికల్ కాలేజీల్లో చివరి సంవత్సరం విద్యార్థులను తీసుకోవాలని భావించారు. వారందరికీ చదువు పూర్తయినా పరీక్షలు ఇంకా కాలేదు. అయితే ఇపుడు అత్యవసరం కాబట్టి వారి సేవలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

అలా చెప్పటంతో..

ఆదివారం నాడు అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లతో అధికారులు సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు నియామక పత్రాలు అందజేస్తామని... కాలేజీలకు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, లేదా కొవిడ్ కేర్ కేంద్రాల వద్దకు విద్యార్థులను పంపాలని సూచించారు. అయితే ప్రస్తుతం కాలేజీలు లేని కారణంగా వారందరికీ ఫోన్లలో సమాచారమిచ్చారు. అయితే ఆసుపత్రులు అని కాకుండా డీఎంహెచ్​వో కార్యాలయానికి రావాలని వారు చెప్పారు.

పొరపాటు జరిగింది

విద్యార్థులు హడావుడిగా ఎక్కడెక్కడి నుంచో గుంటూరులోని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి కార్యాలయానికి తరలివచ్చారు. ఉదయం 9గంటల నుంచి పడిగాపులు కాశారు. ఇంతమంది ఎందుకు వచ్చారని ఆరాతీస్తే విషయం బయటపడింది. అందరీనీ సంబంధిత కాలేజీలకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వ కాలేజీల విద్యార్థులను మాత్రం గుంటూరు జీజీహెచ్​కు పంపించారు. అధికారుల తీరుపై విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల వాదన మాత్రం మరోలా ఉంది. తాము విద్యార్థులకు సమీపంలోని ఆసుపత్రికి పంపాలని ప్రిన్సిపాళ్లకు సూచించినట్లు గుంటూరు జిల్లా ప్రత్యేక కలెక్టర్ బాబూరావు తెలిపారు. ఆ విషయం విద్యార్థులకు చేరవేయటంలో పొరపాటు జరిగిందన్నారు.

ఇదీ చదవండి

భీమవరంలో దారుణం...చెత్త బండిలో కరోనా అనుమానితుడి తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.