గుంటూరు జీజీహెచ్‌లో పరీక్షల కోసం వచ్చిన నర్సింగ్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన వైద్య సిబ్బంది వారిని అత్యవసర వార్డుకు తరలించి వైద్య చికిత్స అందించారు. పరీక్షల ఒత్తిడి రాత్రి సరిగ్గా భోజనం చేయకపోవడం వలన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని.. ఎటువంటి ప్రమాదం లేదని నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ భువనేశ్వరి తెలిపారు.
గుంటూరు నగర శివారు పొత్తూరు గ్రామంలో మదర్ కేర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన కొందరు విద్యార్థులు నర్సింగ్ కోర్సు చేస్తున్నారు. మొదటి సంవత్సరం పరీక్షల్లో భాగంగా గుంటూరు జీజీహెచ్‌లో శుక్రవారం ఉదయం పరీక్షలు రాయడానికి వచ్చారు. పరీక్షలు రాసి తిరిగి కళాశాల హాస్టల్‌కి వెళుతున్న సమయంలో విద్యార్థినులు ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయారు. గమనించిన సిబ్బంది వారిని అత్యవసర వార్డుకు తరలించారు. కళ్లు తిరిగి నీరసంగా ఉన్న విద్యార్థినులకు గ్లూకోజ్ బాటిల్స్ ద్వారా వైద్యం అందించారు.
పరీక్షల ఒత్తిడి, రాత్రి వేళ ఏమి తినకుండా ఉంటడం వలన నలుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని మదర్ కేర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ భువనేశ్వరి తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు రికవరీ అయి హాస్టల్‌కి వెళ్లారని.. మరో ఇద్దరికి నీరసంగా ఉండటంతో సెలెన్ ఎక్కిస్తున్నారని చెప్పారు.
ఇదీ చదవండి: