ETV Bharat / state

నిరుద్యోగులకు తీపి కబురు.. పోలీసు నియామకాలకు నోటిఫికేషన్​ రిలీజ్​ - NOTIFICATION FOR POLICE RECRUITMENT

notification released for police recruitment

author img

By

Published : Nov 28, 2022, 3:07 PM IST

Updated : Nov 28, 2022, 3:42 PM IST

15:03 November 28

అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ

NOTIFICATION FOR POLICE RECRUITMENT : రాష్ట్రంలో ఎట్టకేలకు పోలీసు నియామకాలకు నోటిఫికేషన్​ విడుదలైంది. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరీక్షణకు తెరపడింది. మొత్తం 6100 కానిస్టేబుళ్లు, 411 ఎస్‌ఐ పోస్టులకు నోటిఫికేషన్‌ వెలువడింది. 315 ఎస్‌ఐ, 96 రిజర్వ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌, 3,580 కానిస్టేబుల్ (సివిల్‌), 2,520 ఏపీఎస్పీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.

కానిస్టేబుల్‌ పోస్టులకు ఈనెల 30 నుంచి డిసెంబర్‌ 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జనవరి 22న ప్రిలిమనరీ రాతపరీక్ష జరగనుంది. ఎస్‌ఐ పోస్టులకు డిసెంబర్‌ 14 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తులు స్వీకరించి.. ఫిబ్రవరి 19న ప్రిలిమనరీ రాత పరీక్ష ఉంటుంది. ఎస్‌ఐ పోస్టులకు ఫిబ్రవరి 5 నుంచి హాల్‌టికెట్లు జారీ కానుండగా.. కానిస్టేబుల్‌ పోస్టులకు జనవరి 9 నుంచి హాల్‌టికెట్లు జారీ చేస్తారు. ఎస్​ఐ పోస్టులకు ఫ్రిబవరి 19న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సా.5.30 గంటల వరకు పేపర్‌-2 ఎస్‌ఐ పరీక్ష జరగనుంది.

ఇవీ చదవండి:

Last Updated : Nov 28, 2022, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.