గుంటూరు జిల్లా మాచర్లలో తెదేపా నేతలపై జరిగిన దాడి ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. దాడికి పాల్పడిన ముగ్గురిపైనా పోలీసులు సెక్షన్ 307, సెక్షన్ 153 కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన ఆయన.. మాచర్లలో ముగ్గురు వ్యక్తులు పోలీసు అధికారి విధులకు ఆటంకం కలిగించారని.. ప్రజా ప్రతినిధులపై దాడులు చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్ నివేదిక, పోలీసు అధికారులు విచారణ చేపట్టారని అన్నారు. నివేదిక ఆధారంగా నిందితులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: