ETV Bharat / state

ఆయిల్​ ట్యాంకర్​ డ్రైవర్ల ఆందోళన - పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు

No Petrol Boards at Petrol Refilling Stations in Hyderabad : హైదరాబాద్​లో కొన్ని పెట్రోల్ బంకుల్లో నో పెట్రోల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు కేంద్రం మోటారు వాహనాల చట్టంలో సవరణలు చేసినందుకు ఆందోళనకు దిగడంతో చాలా పెట్రోల్ బంకులలో నో పెట్రోల్, డీజిల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యూ కడుతున్నారు.

No_Petrol_Boards_at_Petrol_Refilling_Stations_in_Hyderabad

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2024, 5:12 PM IST

No Petrol Boards at Petrol Refilling Stations in Hyderabad : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ బంకులలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. హెచ్​పీ, బీపీసీ, ఐఓసీ కంపెనీల నుంచి పెట్రోల్ తీసుకెళ్లే ట్యాంకర్ డ్రైవర్లు చర్లపల్లి ఆయిల్ కంపెనీ(Oil Companys)ల వద్ద ధర్నాకు దిగారు. సోమవారం ఉదయం నుంచి ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు నిరసనలు చేస్తున్నారు.

Center Motor Vehicles Act : కేంద్రం మోటారు వాహనాల చట్టంలో సవరణలు చేస్తూ ప్రమాదం చేసి పారిపోతే పదేళ్ల జైలు శిక్షతో పాటు, రూ.7 లక్షలు జరిమానాతో కఠిన శిక్షలు పడేలా చట్ట సవరణ చేశారు. దీంతో ఆయిల్ ట్యాంకర్(Oil Tanks) డ్రైవర్లు ఈ నిబంధనలు తమకు గుదిబండలా మారాయని వెంటనే వెనక్కి తీసుకోవాలని ధర్నాకు దిగారు. రోజూ ఈ మూడు కంపెనీల నుంచి 18 వేల కిలో లీటర్ల పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నారు. వీరి ధర్నాతో ఒక్క ట్యాంకర్ కూడా బయటకు వెళ్లలేదు. వీరి నిరసనలతో హైదరాబాద్​లో సగానికి పైగా ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్లలో నిల్వలు నిండుకున్నాయి.

ట్రక్కు డ్రైవర్ల నిరసనతో ఇంధన కొరత! పెట్రోల్‌ బంక్​లలో ఫుల్ రష్​

ధర్నా విరమించిన ఆయిల్ ట్యాంకు డ్రైవర్లు : వెంటనే చర్లపల్లిలోని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల డ్రైవర్లు చేస్తున్న ధర్నాను విరమింపజేశారు. దీంతో యథావిధిగా పెట్రోల్, డీజిల్ ట్యాంకులు(Petrol Refiling Stations) నడుస్తున్నాయి. హెచ్​పీ, బీపీసీ, ఐఓసీ ఆయిల్ కంపెనీలలో పెట్రోల్, డీజిల్ నింపుకొని ట్యాంకర్లు బయలుదేరాయి. సాయంత్రం 6 గంటల సమయంలో పలు బంకులకు ఆయిల్ ట్యాంకర్లు చేరుకోనున్నాయి. రాత్రి వరకు అన్ని బంకులలో యథావిధిగా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం గుడ్​న్యూస్- పెట్రోల్​, డీజిల్​పై రూ.10 తగ్గింపు!

హైదరాబాద్​లో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు : హైదరాబాద్​లోని పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో వాహనాదారులు బారులు తీరారు. రెండు రోజులు పెట్రోల్ బంకులు బంద్ అనడంతో ఒక్కసారిగా పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యూ కడుతున్నారు. ముందు జాగ్రత్తగా స్టోరేజ్ చేసి పెట్టుకుంటున్నారు. కొన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ లేక నో స్టాక్ బోర్డు పెట్టి మూసేశారు. నిబంధనలను పెట్రోల్ బంకు యజమానులు పాటించడం లేదని కొన్ని నో స్టాక్ బోర్డులు పెట్టిన బంకులను చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ 30 శాతం నిల్వ ఉంచుకోవాలని సంబంధింత శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ వాటిని కొన్ని పెట్రోల్ బంకులు పాటించలేదు.

పెట్రోల్ బంక్​లో అదుపు తప్పి.. డ్రైవర్​పైకి దూసుకెళ్లిన ట్రాక్టర్! సీసీ కెమెరాలో దృశ్యాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.