ETV Bharat / state

డెల్టా రైతులను నిండా ముంచిన నివర్ తుపాన్ - guntur latest updates

గుంటూరు డెల్టా రైతులను నివర్‌ తుపాన్‌ నిండా ముంచింది. అన్నదాతల ఆశలను నీళ్లపాలు చేసింది. కోసిన పంట..... భారీ వర్షానికి నీళ్లలో నానుతోంది. కోతకొచ్చిన పైరు నేలవాలింది. సాగు ఏమాత్రం చేతికి రాదంటున్న రైతులు... ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

డెల్టా రైతులను నిండా ముంచిన నివర్ తుపాన్

author img

By

Published : Dec 4, 2020, 8:53 AM IST

డెల్టా రైతులను నిండా ముంచిన నివర్ తుపాన్

నివర్‌ తుపానుతో వచ్చిన అకాల వర్షాలు... గుంటూరు జిల్లా డెల్టా రైతులకు తీవ్ర నష్టాలు మిగిల్చాయి. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడం వల్ల.... అన్నదాతలు లబోదిబోమంటున్నారు. కొన్నిచోట్ల పంట కోతకు సిద్ధంగా ఉండగా.... మరికొన్ని చోట్ల కోసిన పంట నూర్పిడి చేయాల్సి ఉంది. వర్షాల కారణంగా కోతకు సిద్ధంగా ఉన్న పంట మొత్తం నేలకొరిగింది. ఇప్పటికే 2 వరదలకు పంట దెబ్బతిని... దిగుబడి లేక రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. మిగిలిన పంటా నీళ్లపాలై...., రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

పొలాల్లో నీరు పూర్తిగా ఇంకితేనే కోత చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఆలోగానే ధాన్యం మొలకెత్తుతోంది. మరికొన్ని చోట్ల కోసిన పంట రంగు మారుతోంది. దానిని కొనేందుకు ముందుకు ఎవరూ రాని పరిస్థితి. ఫలితంగా పెట్టుబడి కూడా చేతికిరాదని అన్నదాతలు వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌... రంగు మారిన పంట సహా మొలకలెత్తిన ధాన్యం కొనేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

ఇదీ చదవండి:

గుంటూరు జిల్లాలో కొత్తగా 72మందికి కరోనా నిర్ధారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.