ETV Bharat / state

NGT Orders to Stop Sand Mining: 'తాజా పర్యావరణ అనుమతులు లేకుండా.. ఇసుక తవ్వొద్దు'.. మరోసారి స్పష్టం చేసిన ఎన్జీటీ - NGT orders to stop sand mining

NGT
ఎన్‌జీటీ
author img

By

Published : Aug 3, 2023, 6:41 PM IST

Updated : Aug 4, 2023, 6:33 AM IST

18:32 August 03

పర్యావరణ అనుమతులు తీసుకునే వరకు తవ్వకాలు చేపట్టరాదన్న ఎన్‌జీటీ

NGT Orders to Stop Sand Mining: పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేయకూడదంటూ N.G.T. మరోసారి స్పష్టం చేసింది. ఏప్రిల్ 24న ఆదేశాలిచ్చిన తర్వాత.. ఎవరైనా ఇసుక తవ్వకాలు జరిపారా అనే దానిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సియాని ఆదేశించింది. దీంతో NGT ఆదేశాలను ధిక్కరించి.. జేపీ సంస్థ ముసుగులో వైసీపీ నేతలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారన్నారంటూ 'ఈనాడు-ఈటీవీ-ఈటీవీ భారత్​' రాసిన కథనాలు అక్షర సత్యాలని తేటతెల్లమైంది.

జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలను ధిక్కరించి.. ఎలాంటి అనుమతులు లేకుండా జేపీ సంస్థ ముసుగులో వైసీపీ నేతలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారంటూ .. 'ఈనాడు-ఈటీవీ-ఈటీవీ భారత్​' రాసిన కథనాలు అక్షర సత్యాలని తేటతెల్లమైంది. ఈనాడు - ఈటీవీ-ఈటీవీ భారత్​ కథనాలు తప్పు అని.. పర్యావరణ అనుమతులు ఉన్న రీచుల్లో మాత్రమే తవ్వుతున్నామంటూ గనుల శాఖ చెప్పిందంతా అబద్ధమేనని నిరూపితమైంది. ప్రభుత్వ శాఖలు ఇన్నాళ్లుగా ఎన్జీటీల కళ్లకు గంతలు కట్టిన తీరు స్పష్టంగా బయటపడింది.

రాష్ట్ర పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ నుంచి తాజా పర్యావరణ అనుమతులు తీసుకోకుండా రాష్ట్రంలో ఎక్కడా ఇసుక తవ్వకాలు చేపట్టడానికి వీల్లేదంటూ ఎన్జీటీ చెన్నై బెంచ్‌ బుధవారం తీర్పునిచ్చింది. ఇంతకుముందే ఈ ఆదేశమిచ్చినప్పటికీ మరోసారి ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నామని పేర్కొంది. ఆ తీర్పు గురువారం వెలుగులోకి వచ్చింది. ఇసుక తవ్వకాలన్నీ తక్షణమే నిలిపేయాలని ఎన్జీటీ మార్చిలోనే ఆదేశాలిచ్చినా.. గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి వాటిని బేఖాతరు చేశారనేది దీంతో స్పష్టమైంది. రాష్ట్రంలో 110 రీచుల్లోనూ ఇసుక తవ్వకాలు నిలిపేయాలంటూ ఏప్రిల్‌ 24న ఆదేశాలిచ్చిన తర్వాత వాటిని ధిక్కరించి జేపీ సంస్థ లేదా ఇతర ఇతరులు ఎవరైనా రీచుల్లో ఇసుక తవ్వకాలు జరిపారా.. అనేదానిపై సమగ్ర నివేదిక సమర్పించాలని సీయాను, జేపీ సంస్థను ఎన్జీటీ తాజా తీర్పులో ఆదేశించింది.

సీయా నుంచి ఏప్రిల్‌ 24న నోటీసులు అందిన తర్వాత రీచుల్లో ఇసుక తవ్వకాలు నిలిపేశామని, వర్షాకాలం ప్రారంభమవటంతో అసలు ఎవరూ తవ్వకాలు జరిపే అవకాశమే లేదని జేపీ సంస్థ తరఫు న్యాయవాది వాదించారు. చిత్తూరు జిల్లాలోని అరణియార్‌ నది పరిధిలో 18 రీచుల్లో తవ్వకాలు నిలిపేయమని మాత్రమే ఎన్జీటీ ఆదేశాలిచ్చిందన్నారు. సీయా నోటీసుల్లో పేర్కొన్న 110 రీచ్‌ల్లో తవ్వకాలు ఆపేయాలని చెప్పలేదని.. దీనిపై వివాదం ఉందని వివరించారు. దీన్ని పిటిషనర్‌ నాగేంద్రకుమార్‌ తరఫు న్యాయవాది ఖండించారు. వర్షాకాలంలోనూ ఇసుక తవ్వకాలు జరిపేందుకు వీలుగా జేపీ సంస్థ రీచుల్లో భారీగా యంత్రాలను మోహరించిందంటూ వాటికి సంబంధించిన అక్షాంశాలు, రేఖాంశాల వివరాలతో కూడిన చిత్రాలను ఎన్జీటీకి సమర్పించారు. గతంలో ఎన్జీటీ ఇచ్చిన తీర్పును తమకు అనుకూలంగా చదువుకుని జేపీ సంస్థ ఆ ఆదేశాలను బేఖాతరు చేసిందన్నారు. వీటన్నింటినీ పరిశీలించిన ఎన్జీటీ తాజా పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా ఇసుక తవ్వకాలు చేపట్టడానికి వీల్లేదంటూ మరోసారి స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబరు 1కి వాయిదా వేసింది.

రాష్ట్రంలోని ఇసుక తవ్వకాల్లో అక్రమాలపై పల్నాడు జిల్లా అమరావతి మండలానికి చెందిన దండా నాగేంద్రకుమార్‌ ఎన్జీటీని ఆశ్రయించారు. దీనిపై విచారించిన ఎన్జీటీ ఇసుక తవ్వకాలు నిలిపేయాలంటూ ఈ ఏడాది మార్చిలో తీర్పిచ్చింది. దాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో ఇసుక వ్యాపారం చేస్తున్న వైసీపీ నాయకులు.. నాగేంద్రకుమార్, ఆయనకు సహకరించిన కంచేటి సాయిపై కక్ష కట్టి రకరకాలుగా వేధిస్తున్నారు. వాటిని భరించలేక నాగేంద్రకుమార్‌ కొన్నాళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. కంచేటి సాయిపై ఏకంగా పీడీ చట్టం ప్రయోగించి జైలుకు పంపించారు.

రాష్ట్రంలో అన్ని రీచుల్లో ఇసుక తవ్వకాలు నిలిపేయాలంటూ మార్చి 23న ఎన్జీటీ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ జులై 14న సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. వాటిని ధిక్కరించి చిత్తూరు జిల్లాలో అరణియార్‌ నదితోపాటు, అక్కడి 18 రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్న వైనంపై జులై 19న ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్​లో కథనం ప్రచురితమైంది. కోర్టు ఆదేశాలతో తక్షణం ఇసుక తవ్వకాలు నిలిపేసినా ఈనాడు తన ద్వేషాన్ని, అక్కసును వెళ్లగక్కిందని...... ఊహలతో, అబద్ధాలతో కూడిన కథనం ప్రచురించిందంటూ గనుల శాఖ అడ్డగోలుగా వాదించింది. వాస్తవంగా గురువారం కూడా ఆ రీచుల్లో ఇసుక తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి.

రాష్ట్రంలోని 110 రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు ఆపేయాలని సియా నోటీసిచ్చినా, పట్టించుకోకుండా రాష్ట్రమంతా భారీ ఎత్తున అక్రమ తవ్వకాలు కొనసాగిస్తుండటంపై ఈనాడు - ఈటీవీ-ఈటీవీ భారత్​లో జులై 20న మరో కథనం ప్రచురితమైంది. ఈసీలు లేకుండానే తవ్వకాలు జరుపుతున్నారని ఆధారాలతో వెల్లడించింది. అయితే అన్ని రీచ్‌ల్లో పర్యావరణ అనుమతి మేరకు తవ్వకాలు జరుగుతున్నాయని, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనే ఉద్దేశంతో తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని గనుల శాఖ దబాయించింది. కానీ ఇప్పటికీ రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదుల పరిధిలో వరదనీటి ప్రవాహం ఉన్నచోట మినహా, మిగిలిన అన్ని రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు, విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి.

ఇసుక తవ్వకాలు ఆపేయాలని సియా నోటీసిచ్చాక ఏం జరిగిందో నివేదిక అందజేయాలని ఎన్జీటీ ఆదేశించిన నేపథ్యంలో.. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అక్రమాలన్నీ వెలుగులోకి వస్తాయి. ఏయే రీచ్‌ల్లో తవ్వారు, డిపోల్లో డంప్‌ చేసిన లక్షల టన్నుల ఇసుక ఎక్కడి నుంచి వచ్చింది, రీచ్‌లో వినియోగించిన యంత్రాలు ఏ స్థాయివి అనేవి క్షుణ్ణంగా పరిశీలిస్తే అవకతవకలన్నీ బట్టబయలవుతాయి. వీరికి గనులశాఖ ఎలా సహకరించింది అనేదీ వెలుగులోకి వస్తుంది.

Last Updated : Aug 4, 2023, 6:33 AM IST

For All Latest Updates

TAGGED:

sand
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.