ETV Bharat / state

గుంటూరు జీజీహెచ్​కు 20 కిలోలీటర్ల ఆక్సిజన్ ప్లాంట్

దక్షిణ కోస్తాంధ్ర ప్రదాయనిగా పేరొందిన గుంటూరు సర్వజనాస్పత్రికి మరో సదుపాయం వచ్చింది. 20 కిలోలీటర్ల సామర్ధ్యమున్న ఆక్సిజన్ ప్లాంటును జీజీహెచ్​లో ఏర్పాటు చేశారు. కరోనా వేళ మంచాలు సరిపోక, ఊపిరందక విపత్కర పరిస్థితుల్లో అల్లాడుతున్న రోగులకు ఈ వార్త నిజంగా ప్రాణవాయువే.

new oxygen plant facility in guntur ggh
గుంటూరు జీజీహెచ్​కు 20 కిలోలీటర్ల ఆక్సిజన్ ప్లాంట్
author img

By

Published : Sep 23, 2020, 6:54 PM IST

సాధారణ రోజుల్లో గుంటూరు సర్వజనాస్పత్రి రోగులతో కిటకిటాలాడుతుంది. వివిధ జిల్లాల నుంచి రోజుకు 5 నుంచి 6వేల మంది రోగులు వైద్య చికిత్సల కోసం జీజీహెచ్​​ను ఆశ్రయిస్తారు. కరోనా వల్ల తాకిడి తగ్గినప్పటికీ కొవిడ్ బాధితులతోనూ ఆసుపత్రి నిండిపోతోంది. కరోనా వైద్యచికిత్సల కోసం 600 మంచాలున్నప్పటికీ... వీటిలో ఆక్సిజన్ సదుపాయం ఉన్నవి సుమారుగా నాలుగోవంతు మాత్రమే. ఇక వెంటిలేటర్లు పాతవి, కొత్తవి కలిపి 150 వరకు ఉండవచ్చు. వీటి అన్నింటికన్నా ముఖ్యమైంది ప్రాణవాయువు ఆక్సిజన్.

కొవిడ్ వేళ జిల్లాలో కీలక ఆసుపత్రిగా సేవలందిస్తోన్న గుంటూరు సర్వజనాసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో రోగులు ప్రాణాపాయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మరికొందరు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం జీజీహెచ్​లో 10వేల కిలోలీటర్ల ఆక్సిజన్ ప్లాంటు ఉంది. అదనంగా 20 కిలో లీటర్ల ప్లాంటు ఆందుబాటులోకి వచ్చింది. ఎంతో వ్యయప్రయాసల కోర్చి దీన్ని ముంబయి నుంచి తీసుకువచ్చారు. దీనిని అమర్చే ముందు జిల్లా జాయింట్ కలెక్టర్లు దినేశ్ కుమార్, ప్రశాంతి వచ్చి పరిశీలించారు. సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు. కొత్త ఆక్సిజన్ ప్లాంటు రాకతో ఇకపై కరోనా రోగుల కష్టాలు తీరే అవకాశముంది.

కరోనా కష్టకాలంలో అందుబాటులోకి వచ్చిన ప్రాణవాయువుతో రోగులు, బంధువులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కొత్త ప్లాంటుతో మరి కొంతమంది కొవిడ్ బాధితులకు సేవలందించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చదవండి..

రుణాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు.. తర్వాత బెదిరింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.