గుంటూరు జిల్లా మెరికపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ దంపతులకు స్వల్ప గాయాలయ్యాయి. నకరికల్లు మండలం చల్లగుళ్ళ గ్రామానికి చెందిన ప్రసన్నకుమార్‌కు పూజ అనే యువతితో గుంటూరులో వివాహం జరిగింది. అనంతరం ప్రసన్నకుమార్ స్వగ్రామానికి బయలుదేరారు. ఫిరంగిపురం మండలం మెరికపూడి వద్దకు వచ్చేసరికి నవ వధూవరులు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంటలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నూతన జంట ప్రసన్న కుమార్, పూజతో పాటు మరో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. వాహనం పూర్తిగా దెబ్బతిన్నా, అందరూ బతికి బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: గాయపడిన న్యాయవాదికి చంద్రబాబు పరామర్శ