గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నీలోని రాళ్లు కరిగించే కొత్త యంత్రాన్ని జీజీహెచ్ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ ఈశ్వరమ్మ ప్రారంభించారు. కోటి 80 లక్షల రూపాయల విలువైన పరికరాన్ని ప్రభుత్వం జీజీహెచ్‌కు కేటాయించింది. ఎలాంటి శస్త్ర చికిత్స, మత్తు ఇవ్వకుండానే రాళ్లు తొలగిస్తామని ఈశ్వరమ్మ తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తారని.. జీజీహెచ్‌లో పూర్తిగా ఉచిత సేవలు అందిస్తామని ఆమె పేర్కొన్నారు.

ఇదీ చదవండి: