గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. దీంతో జిల్లా పాలనాధికారి శామ్యూల్ ఆనంద్ కుమార్ కొత్తగా కంటైయిన్‌మెంట్ జోన్లను ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో కేసుల ప్రకారం కంటైయిన్‌మెంట్ జోన్లను నిర్ణయించారు.
తాడేపల్లి పట్టణంలోని సుందరయ్యనగర్, కొలనుకొండ, తాడేపల్లి మండలం పరిధిలోని వడ్డేశ్వరం, మంగళగిరి పట్టణం పరిధిలోని కొప్పురావూరు కాలనీ, రొంపిచర్ల మండలం పరిధిలోని విప్పర్ల, దుగ్గిరాల మండలం పరిధిలోని సుగాలీ కాలనీలను కంటైయిన్‌మెంట్ జోన్లుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇదీ చదవండి: 'చైనా ఏకపక్ష ధోరణి ప్రదర్శిస్తే సహించేది లేదు'