ముఖ్యమంత్రి సహాయనిధికి నెల్లూరుకు చెందిన బిఎంఆర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కోటి రూపాయల విరాళం ఇచ్చింది. నాడు-నేడు పథకంలో భాగంగా పాఠశాలలు, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం విరాళం అందించినట్లు సంస్థ తెలిపింది. కావలి నియోజకవర్గం ఇసుకపల్లి గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్ ఆట స్ధలానికి 3.10 ఎకరాల స్ధలం అప్పగించింది. విరాళానికి సంబంధించిన చెక్కు, స్ధలానికి చెందిన పత్రాలను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన బిఎంఆర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు అందజేశారు.
ఇవీ చదవండి: కేంద్ర మంత్రికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లేఖ