గుంటూరు జిల్లాలో రేపల్లె డ్రెయిన్లో గల్లంతైన ఇద్దరు యువకుల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపట్టాయి. కొల్లిపర మండలం పిడపర్తిపాలెం గ్రామానికి చెందిన యామినేని సాయి సునీల్, యామినేని చామంత్ నిన్న సాయంత్రం గేదెలు కడిగేందుకు డ్రెయిన్ లోకి దిగారు. నీళ్ల లోతు ఎక్కువగా ఉండటంతో చామంత్ మునిగిపోయాడు. అతడిని రక్షించేందుకు ప్రయత్నించిన సాయి సునీల్ కూడా ప్రవాహ వేగానికి కొట్టుకుపోయాడు.
ఇద్దరి కోసం గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ కు సమాచారం ఇచ్చారు. వారు ఈ రోజు ఉదయం మోటార్ బోట్ల సాయంతో వెతకటం ఆరంభించారు . కానీ ఇప్పటి వరకూ యువకుల ఆచూకీ లభించలేదు.
ఇదీ చదవండీ...