కృష్ణా జలాలపై తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న తీరు దుర్మార్గపు చర్య అని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దుర్మార్గపు అలోచనలు చేస్తోందన్నారు. విద్యుత్ తయారీ పేరుతో 30 వేల క్యూసెక్కుల నీటిని వృథాగా విడుదల చేసి, రాష్ట్ర రైతులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు.
మరోవైపు గ్రామాల్లో రెవెన్యూ అధికారుల పనితీరుపై ఎమ్మెల్యేగోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక వైకాపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన... సిబ్బంది పనితీరుపై మండిపడ్డారు. వారి వైఖరి వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రొంపిచర్ల మండలంలో సుమారు 10వేల ఎకరాల భూములు ఆన్‌లైన్‌లో నమోదవలేదన్నారు. ఈ సమస్యలు పరిష్కరించేందుకు ఇటీవల జిల్లా కలెక్టర్‌తో కలిసి రైతు సదస్సు నిర్వహించామని, మరికొన్ని రోజుల్లోనే భూములు ఆన్‌లైన్‌లో నమోదవుతాయని తెలిపారు.
ఇదీచదవండి.