ETV Bharat / state

నూరు శాతం ఆన్​లైన్ బోధన...ఆ కళాశాల సొంతం - గుంటూరు జిల్లా వార్తలు

కరోనా విజృంభణ మనిషి జీవనశైలితో పాటు దేశంలో విద్యాబోధన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా విద్యాసంస్థలు మూసివేయటంతో ఆన్‌లైన్‌ బోధనవైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని... ఏపీలోనే 100 శాతం డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో విద్యాబోధ‌న చేస్తున్న మొద‌టి కళాశాలగా నరసారావుపేట ఇంజినీరింగ్ కళాశాల రికార్డు సృష్టించింది.

narasaraopeta-engg-college-first-digital-class-in-ap
న‌ర‌సారావుపేట ఇంజి‌నీరింగ్ కళాశాల
author img

By

Published : Jun 20, 2020, 5:46 PM IST

గుంటూరు జిల్లా న‌ర‌సారావుపేట‌లో ఉన్న న‌ర‌సారావుపేట ఇంజి‌నీరింగ్ కళాశాల ప్ర‌త్యేక గుర్తింపు పొందింది. ఏపీలోనే 100 శాతం డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో విద్యాబోధ‌న చేస్తున్న మొద‌టి కళాశాలగా రికార్డు సృష్టించింది. కొవిడ్-19 కార‌ణంగా గ‌త కొద్ది నెల‌లుగా విద్యార్థుల‌కు ఆన్‌లైన్ ద్వారా రెగ్యుల‌ర్‌గా త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్నారు. అలాగే ఇ-లెర్నింగ్ వ‌ర్క్‌షాప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు కోర్స్ ఎరా, యుడెమీ త‌దిత‌ర ప్ర‌ముఖ లెర్నింగ్ ప్లాట్‌ఫాంలలో విద్యార్థుల‌కు స‌బ్‌స్క్రిప్ష‌న్‌లు అందిస్తున్నారు. దీంతో వారు బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్‌, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, ఇండ‌స్ట్రియ‌ల్ ట్రెయినింగ్‌, మాట్‌ల్యాబ్‌, ఆటోక్యాడ్ త‌దిత‌ర కోర్సుల‌ను ఆన్‌లైన్‌లో నేర్చుకుంటున్నారు.

కళాశాల విద్యార్థుల‌కు విద్యాబోధ‌న చేసేందుకు అందుబాటులో ఉన్న దాదాపు అన్ని సాంకేతిక ప‌ద్ధతుల‌ను యాజ‌మాన్యం ఉప‌యోగించుకుంటూ పూర్తిగా డిజిట‌ల్ విధానంలో త‌ర‌గతుల‌ను నిర్వ‌హిస్తోంది. టెక్నాల‌జీ ఆధారిత ప్లాట్‌ఫాంలు, టూల్స్‌తో వినూత్న రీతిలో విద్యాబోధ‌న చేస్తున్నారు. అలాగే విద్యార్థులు, ప్రొఫెస‌ర్లు ఒకే వేదిక‌పైకి వ‌చ్చేలా జూమ్‌, వెబ్ఎక్స్ త‌దిత‌ర వీడియో కాన్ఫ‌రెన్స్ యాప్‌ల‌ను వాడుతున్నారు. దీంతో విద్యార్థులు ఆయా పాఠ్యాంశాల్లో త‌మ‌కున్న సందేహాల‌ను చాలా సుల‌భంగా తీర్చుకుంటున్నారు. ఇక ఇన్‌స్ట్ర‌క్చ‌ర్స్ కాన్వాస్‌, బ్లాక్‌బోర్డ్‌, గూగుల్ క్లాస్ రూం త‌దిత‌ర అధునాత‌న లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్‌ల‌ను కాలేజీలో ఉప‌యోగిస్తున్నారు.

ఆ సాఫ్ట్​వేర్ సహాయంతో పరీక్షలు..

విద్యార్థులు పాఠ్యాంశాల‌పై మ‌రింత శ్రద్ధ పెట్టేలా వారికి ప్రొక్టొరియో సాఫ్ట్‌వేర్ స‌హాయంతో ఆన్‌లైన్‌లోనే ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. క‌రోనా నేప‌థ్యంలో డిజిట‌ల్ విద్య‌కు మ‌రింత డిమాండ్ ఏర్ప‌డ‌నున్న దృష్ట్యా కాలేజీ విద్యార్థుల భ‌విష్య‌త్తు కోసం ఈ విధంగా అధునాత‌న సాంకేతిక ప‌ద్ద‌తుల్లో వారికి విద్యాబోధ‌న చేస్తోంది. దీంతోపాటు వినూత్నమైన విద్యా విధానాలను అనుస‌రిస్తూ, అనేక ర‌కాల డిజిట‌ల్ టూల్స్‌తో విద్యార్థులు చ‌దువుకుంటున్నారు.

ప్రతి విద్యార్థి ప్రగతి సమీక్ష...

ఆన్‌లైన్‌లోనే విద్యాబోధ‌న చేస్తున్న‌ప్ప‌టికీ క‌ళాశాల యాజ‌మాన్యం ఏ విద్యార్థినీ విడిచిపెట్ట‌డం లేదు. ప్ర‌తి ఒక్క విద్యార్థినీ సంప్ర‌దిస్తూ వారు ఆయా పాఠ్యాంశాల్లో సాధిస్తున్న ప్ర‌గ‌తిని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నారు. దీంతోపాటు ఇ-లెర్నింగ్ మాక‌ప్స్ నిర్వ‌హిస్తుండ‌డం వ‌ల్ల విద్యార్థుల‌కు విద్యారంగ నిపుణుల‌తో మ‌మేక‌మై త‌మ సందేహాల‌ను తీర్చుకునే వీలు క‌లుగుతోంది. అలాగే నిపుణులైన ప్రొఫెస‌ర్లచే వారు విలువైన స‌ల‌హాలు, సూచ‌న‌లు కూడా పొందుతున్నారు.

ఇదే విష‌యంపై క‌ళాశాల వైస్ చైర్మ‌న్ ఎం.చ‌క్ర‌వ‌ర్తి స్పందిస్తూ.. కొవిడ్ 19 కార‌ణంగా విద్యార్థుల‌కు విద్యాబోధ‌న చేయ‌డం ఉపాధ్యాయుల‌కు స‌వాల్‌గా మారింద‌న్నారు. లాక్‌డౌన్ వ‌ల్ల అనేకమందిలో భ‌యాలు నెల‌కొన్నాయ‌న్నారు. అయితే ఉపాధ్యాయులంతా ముందుకు వ‌చ్చి విద్యార్థుల‌కు సాంకేతిక ప‌ద్ధ‌తుల్లో విద్య‌నందించాల‌ని అన్నారు. తాము క‌ళాశాల‌లో అధునాత‌న సాంకేతిక ప‌ద్ధ‌తుల్లో విద్య‌ను అందించడంపై ప్ర‌త్యేక దృష్టి సారించామ‌ని తెలిపారు. దీనివ‌ల్ల విద్యార్థుల‌కు ఆన్‌లైన్‌లో చ‌క్క‌గా చ‌దువుకునేందుకు అవ‌స‌ర‌మైన వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంద‌న్నారు.

ఇక కాలేజీలో ఎంఐటీ, హార్వార్డ్‌, స్టాన్‌ఫోర్డ్‌, ఎన్‌పీటెల్‌, ఐఐటీ బాంబే, ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌, ఐట్రిపుల్ఈ త‌దిత‌ర ప్ర‌ఖ్యాత యూనివ‌ర్సిటీలు, కాలేజీల‌కు చెందిన స‌ర్టిఫికేష‌న్ కోర్సుల‌ను కూడా విద్యార్థుల‌కు అందిస్తున్నారు.

ఇవీ చదవండి: పది పరీక్షల్లేవ్.. రద్దు చేసే యోచనలో ప్రభుత్వం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.