ETV Bharat / state

రేపు రమ్యశ్రీ కుటుంబాన్ని పరామర్శించనున్న నారా లోకేశ్

గుంటూరు జిల్లాలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ రేపు పర్యటించనున్నారు. బీటెక్ విద్యార్థిని నల్లపు రమ్యశ్రీ అంత్యక్రియల్లో లోకేశ్ పాల్గొననున్నారు. ఇప్పటికే రమ్య కుటుంబ సభ్యులతో లోకేష్ ఫోన్లో మాట్లాడారు. అనంతరం మంగళవారం కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు.

Naralokesh
నారా లోకేశ్
author img

By

Published : Aug 15, 2021, 10:40 PM IST

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపు గుంటూరు, మంగళవారం కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. గుంటూరులో బీటెక్ విద్యార్థిని నల్లపు రమ్యశ్రీ అంత్యక్రియల్లో లోకేశ్ పాల్గొననున్నారు. ఇప్పటికే రమ్య కుటుంబ సభ్యులతో లోకేష్ ఫోన్లో మాట్లాడారు. ఆమె కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

కర్నూలులో హాజిర హత్య జరిగి సంవత్సరం గడిచిన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల రాష్ట్ర స్థాయి నాయకులతో కలిసి హజిర కుటుంబాన్ని పరామర్శించనున్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు కర్నూలు జిల్లా గోనేగండ్లా మండలం ఏర్రబాడు గ్రామానికి లోకేశ్​తో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీరెడ్డి, జనసేనా పార్టీ పీఏసీ సభ్యులు నాదెండ్ల మనోహర్, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గఫూర్, డీసీసీ అధ్యక్షులు అహ్మద్ అలిఖాన్, ఎస్డీపీఐ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్లా ఖాన్, ఏఐఎంఐఎం కర్నూలు జిల్లా ఇన్​ఛార్జి ఎన్ఎండీ జునైద్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బషీర్ అహ్మద్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజా సంఘాలు పాల్గొననున్నాయి.

ఇదీ చదవండి

Arrest: రమ్య హత్య కేసులో నిందితుడు అరెస్ట్: డీజీపీ గౌతమ్ సవాంగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.