గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం పర్యటించారు. పంచాయతీ ఎన్నికల సమయంలో సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడు గ్రామంలో వైకాపా నేతల దాడిలో మృతి చెందిన తెదేపా కార్యకర్త కార్యకర్త గరికపాటి కృష్ణారావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. వైకాపా ప్రభుత్వం అరాచక పాలన చేస్తోందని లోకేశ్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం సైకో రెడ్డి పాలన నడుస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత లక్కరాజుగార్లపాడులో గరికపాటి కృష్ణారావుని దారుణంగా హత్య చేశారన్నారు.
దళిత నాయకురాలిని సర్పంచ్ చేశారన్న కక్షతో వైకాపా శ్రేణులు కృష్ణారావును హత్య చేశాయని లోకేశ్ ఆరోపించారు. తెదేపా కార్యకర్తల జోలికి వచ్చిన వారికి భవిష్యత్లో వడ్డీతో సహా చెల్లిస్తామని లోకేశ్ అన్నారు. కృష్ణారావు కుటుంబ సభ్యులకు తెదేపా పూర్తిగా అండగా ఉంటుందని తెలిపారు. ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఆర్థిక సాయం చేస్తే... వారు పెద్దమనసుతో వాటిని తిరస్కరించారని పేర్కొన్నారు. ఆ డబ్బులతో కృష్ణారావు పేరుతో ట్రస్టు ఏర్పాటు చేయాలని ఆ కుటుంబాన్ని కోరామని లోకేశ్ వెల్లడించారు.
ఇదీ చదవండి: