ETV Bharat / state

వైకాపా పాలనలో రద్దు తప్ప అభివృద్ధి లేదు: నారా లోకేశ్​ - నారా లోకేశ్ తాజా వార్తలు

వైకాపా ప్రభుత్వ చర్యలపై నారా లోకేశ్ మండిపడ్డారు. 9 నెలల పాలనలో రద్దు తప్ప ప్రజలకు ఉపయోగపడే పని చేయలేదని విమర్శించారు.

nara lokesh
nara lokesh
author img

By

Published : Feb 19, 2020, 11:30 PM IST

ప్రభుత్వంపై నారా లోకేశ్ విమర్శలు

రాజధానిలో రైతుల సమస్యలు పరిష్కరించకుండా వారు ఇచ్చిన భూములను పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించడం ఎంతవరకు సమంజసమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా మంగళగిరి 27వ వార్డులో నారా లోకేశ్ ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. పేద ప్రజల బాధలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలను కరపత్రాల ద్వారా వివరించారు. 9 నెలల్లోనే ప్రభుత్వంపై ఇంత అసమ్మతి రావడం ఇదే మొదటిసారని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ రద్దు చేయడం తప్ప ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క పనీ చేయలేదని విమర్శించారు. విద్యుత్ బిల్లులు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించలేదు కానీ తెదేపా నేతలకు భద్రత మాత్రం తగ్గించారని లోకేశ్​ ఎద్దేవా చేశారు. ఐటీ దాడుల పేరుతో తమపై బురద జల్లేందుకు ప్రయత్నించిన వైకాపా నేతలు ఇప్పుడు తోక ముడిచారని లోకేశ్ అన్నారు.

ఇదీ చదవండి:

వైకాపా నేత తోట త్రిమూర్తులుపై చెప్పుతో దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.